Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అల వైకుంఠపురములో" మేకింగ్ వీడియో... నిర్మాతను నేనేనంటున్న బుడతడు!!

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (13:45 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం అల వైకుంఠపురములో. ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా, సీనియర్ టబు కీలక పాత్రలో నటించింది. వీరితోపాటు.. మలయాళ నటుడు జయరాం , మురళీశర్మ, తమిళ నటుడు సముద్రఖని కూడా నటించారు. 
 
ఈ చిత్రం విడుదలకు మరికొన్ని గంటలే ఉన్న తరుణంలో చిత్ర యూనిట్ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో హీరో అల్లు అర్జున్ తన భార్యాపిల్లలతో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా, బన్నీ కుమారుడు అల్లు అయాన్ మేకింగ్ వీడియోలో అల్లు అయాన్, కెమెరా నుండి చూస్తూ ఈ సినిమాకు నేనే నిర్మాత‌ను అని చెప్పి నిర్మాత‌ల‌కు షాకివ్వ‌డం కొస‌మెరుపు.
 
కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణలు సంయుక్తంగా గీతాఆర్ట్స్-2, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. అల వైకుంఠపురములో చిత్రానికి అద్భుతమైన సంగీత బాణీలను ఎస్. థమన్ సమకూర్చగా, ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసిన గంట వ్యవధిలోనే లక్షన్నర మంది నెటిజన్లు వీక్షించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments