Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యామీలీనే... నిలదొక్కుకునేందుకు అష్టకష్టాలు పడ్డాం : బన్నీ

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (19:04 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం అల వైకుంఠపురములో. ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్ కాగా, సీనియర్ నటి టబు, మలయాళ హీరో జయరాం తదితరులు నటించారు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. 
 
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, తాము మెగా ఫ్యామిలీతో పాటు.. తన తండ్రి అల్లు అరవింద్ సినీ నిర్మాత కావడంతో చిత్రసీమలోకి సులభంగానే అడుగుపెట్టినప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు చాలా కష్టాలుపడినట్టు చెప్పుకొచ్చారు. 
 
సినీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తమ కష్టాలు తమకుంటాయని చెప్పారు. ఏది ఏమైనా స్వయంకృషితో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న నటులంటే తనకు ఎంతో గౌరవం అని బన్నీ చెప్పారు. వారిని చాలా గౌరవిస్తానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. 
 
నిర్మాతను నేనే... అల్లు అయాన్ 
ఈ చిత్రం విడుదలకు మరికొన్ని గంటలే ఉన్న తరుణంలో చిత్ర యూనిట్ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో హీరో అల్లు అర్జున్ తన భార్యాపిల్లలతో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా, బన్నీ కుమారుడు అల్లు అయాన్ మేకింగ్ వీడియోలో అల్లు అయాన్, కెమెరా నుండి చూస్తూ ఈ సినిమాకు నేనే నిర్మాత‌ను అని చెప్పి నిర్మాత‌ల‌కు షాకివ్వ‌డం కొస‌మెరుపు.
 
కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణలు సంయుక్తంగా గీతాఆర్ట్స్-2, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. అల వైకుంఠపురములో చిత్రానికి అద్భుతమైన సంగీత బాణీలను ఎస్. థమన్ సమకూర్చగా, ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసిన గంట వ్యవధిలోనే లక్షన్నర మంది నెటిజన్లు వీక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments