Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అల వైకుంఠపురంలో.." టీజ‌ర్ రిలీజ్‌కి ముహుర్తం ఖరారు

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (14:10 IST)
'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం 'అల.. వైకుంఠపురంలో..' . ఇప్పటికే విడుదలైన ఈ మూవీలోని సాంగ్స్ పాపులర్ అయ్యాయి. 
 
దీంతో ఈ సినిమా థియేట‌ర్స్ లోకి ఎప్పుడు వ‌స్తుందా అని ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు బ‌న్నీ ఫ్యాన్స్. అల్లు అర్జున్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న  ఈ సినిమాలో ఆయనకు  జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు.
 
అభిమానులు, సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ‘అల వైకుంఠపురంలో’ టీజర్ డిసెంబర్ 11న విడుదల కానుంది. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అఫిషియ‌ల్ గా ప్ర‌క‌టించింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
 
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ భారీ చిత్రాన్ని పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు 'గీతా ఆర్ట్స్' 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్స సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments