భారత్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో ఎవరు?

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (10:56 IST)
దేశంలో అనేక మంది అగ్రనుటులు ఉన్నారు. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, తెలుగులో చిరంజీవి, తమిళంలో రజినీకాంత్ ఇలా అనేక మంది స్టార్లు ఉన్నారు. అయితే, దేశంలో ఉన్న హీరోల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోలు ఎవరన్నదానిపై ఇప్పటివరకు స్పష్టమైన క్లారిటీ లేదు. 
 
కానీ, అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ పత్రిక తాజాగా ఓ విషయాన్ని వెల్లడించింది. 2018 జూన్ 1 నుంచి 2019 జూన్ 1 వరకు ఆయా నటుల సంపదను లెక్కించి ఆయా స్టార్ల వార్షిక పారితోషికాన్ని వెల్లడించింది. భారతీయ నటుల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో ఉన్నట్టు తెలిపింది. 
 
2019 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్ మేగజైన్ అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల వివరాలు తెలియజేసింది. ఓవరాల్‌గా చూస్తే హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ 89.4 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, క్రిస్ హెమ్స్‌వర్త్ 76.4 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
 
బాలీవుడ్ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత అక్షయ్ కుమార్ 65 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. జాకీ చాన్ ఐదో స్థానంలో ఉండగా, భారతీయ నటుల్లో అక్షయ్ ఒక్కడే టాప్ టెన్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. మొత్తంగా చూసినైట్లెతే, భారత్ తరఫున అక్షయ్ మొదటి స్థానంలో ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments