Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి అయితే... సో వాట్ : సైరా ప్రచారానికి దూరంగా నయనతార

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (10:39 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మించగా, వచ్చే నెల రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో హీరోయిన్‌గా నయనతార నటించగా, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుధీప్, విజయ్ సేతుపతి, రవికిషన్, తమన్నా వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలు ఇటీవల మొదలయ్యాయి. ఇటీవల ముంబైలో జరిగిన సైరా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో ఒక్క నయనతార మినహా మిగిలిన అగ్ర నటీనటులంతా పాల్గొన్నారు. దీంతో నయనతార.. 'సైరా' ప్రచార కార్యక్రమాల్లో కనిపించటం కూడా అనుమానమే అన్న టాక్‌ వినిపిస్తోంది.
 
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కించారు. 
 
నిజానికి నయనతార సినిమాలో నటించిన తర్వాత ఆ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. ఈ పంథానే సైరా నరసింహా రెడ్డికి కూడా ఆమె అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర హీరోల చిత్రాలమాదిరిగానే చిరంజీవి చిత్రాన్ని కూడా ఆమె చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments