ఈ ముసలి నాగార్జున పక్కన ఓ అమ్మాయి కూడా ఉంది. అచ్చం పల్లెటూరు తాతలా డిఫెరెంట్ లుక్‌లో నాగార్జునను చూసి నెటిజన్లు మురిపోతున్నారు. ఈ వేషంతో వెండితెరపై ఎలాంటి వేషం వేయాలన్నా అది నాగార్జునకే సాధ్యమనే కామెంట్స్ చేస్తున్నారు.
అయితే, ఇదంతా బాగానే ఉంది. కానీ.. ఈ లుక్ ఏ చిత్రంలోనిది అనేదే తేలాల్సి వుంది. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారు మాత్రం నాగ్ కొత్తగా చేస్తున్న మల్టీస్టారర్ సినిమా లోనిదేనని ఘంటా పథంగా చెపుతున్నారు.
నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. 'దేవదాస్' అనే పేరుతో తెరకెక్కే ఈ చిత్రం పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారుకూడా. ప్రస్తుతం వైరల్ అవుతున్న నాగ్ పిక్ కూడా అందులోదే అయితే మాత్రం సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొంటాయి.