Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ మిస్ట‌ర్ మ‌జ్ను టీజర్ అదిరింది..!(Video)

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (10:50 IST)
అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ మిస్టర్ మజ్ను. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లోని అఖిల్ స్టెప్స్, యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే మీరు స్టూడెంట్‌గా ఉన్నప్పుడు, స్ట్రెస్ ఫీల్ అయినపుడు మీరేం చేసేవారు? అంటూ అఖిల్ అడిగిన ప్రశ్నకు చాక్లెట్ తినేదాన్ని అని ఓ అమ్మాయి స‌మాధానం చెబుతుంది.
 
అప్పుడు అఖిల్ ఆరోజుల్లో చాక్లెట్స్‌తో పనైపోయేది. కానీ, టుడేస్ స్ట్రెస్ లెవల్స్‌కి హ్యూమన్ టచ్ కావాలి, ప్రపంచంలోని అందరమ్మాయిలు నా ఒక్కడి కోసమే పుట్టలేదు నిక్కీ. వాళ్ళకీ ఓ లైఫ్ ఉంటుంది.  ఐ రెస్పెక్ట్ దట్ అంటూ అఖిల్ అక్కినేని చెప్పే డైలాగ్స్ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. అలాగే థమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా యూత్‌ఫుల్‌గా ఉంది. 
 
ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. మిస్ట‌ర్ మ‌జ్ను విజ‌యం సాధించ‌డం ఖాయం. అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి. చూడండి టీజర్...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments