Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాస్కర్‌ని నమ్మి అఖిల్ అక్కినేని సినిమా చేస్తాడా?

Webdunia
శనివారం, 6 జులై 2019 (10:33 IST)
నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ హీరోగా కేరీర్ ప్రారంభించి మూడేళ్లు దాటినా ఒక్క హిట్టు కూడా తన ఖాతాలో వేసుకోకపోవడం అభిమానులను కలవరపెడుతున్న విషయమే. తన సినిమా కోసం కథను ఎంచుకోవడంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఫామ్‌లో ఉన్న డైరెక్టర్‌లకు అవకాశం ఇచ్చినా ఫలితం కనబడటం లేదు. అందుకే ప్రతి ప్రాజెక్ట్‌కు మధ్యలో గ్యాప్ ఎక్కువగా వస్తోంది. 
 
నాలుగవ సినిమా గీత బ్యానర్‌పై చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని ప్రారంభించే క్రమంలో పూజా కార్యక్రమాలు చేశారు కానీ రెగ్యులర్ షూటింగ్ అయితే ఇంకా మొదలుపెట్టలేదు. హీరోయిన్‌ని ఫైనల్ చేసే విషయంలో జాప్యం జరుగుతుండటంతో షూటింగ్‌ని పెండింగ్‌లో పెట్టారనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటిదాకా జరిగిన స్క్రిప్ట్ వర్క్ మీద గీత సంస్థ పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేయలేదనే టాక్ కూడా వినిపిస్తోంది. వాటిని ప్రక్కన పెడితే ఈ సినిమా తీస్తున్న దర్శకుడు భాస్కర్ బొమ్మరిల్లు తర్వాత హిట్ కొట్టలేదు. 
 
ఈ సినిమాతో తన లైఫ్‌ని నిలబెట్టుకోవడంతో పాటు అఖిల్ కెరీర్‌ని మంచి బాట పట్టించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితేనే అవకాశాల కోసం ఎదురు చూడొచ్చు. బయట హీరోలతో తక్కువగా సినిమాలు చేసే గీతతో నాగ చైతన్య గతంలో 100 పర్సెంట్ లవ్ తీసి హిట్టు కొట్టాడు. ఇప్పుడు ఇదే తరహాలో అఖిల్ హిట్ కొడతారని అభిమానులు ఆశలు పెట్టుకుంటున్నారు. 
 
హిట్ దర్శకులు తనకు కలిసిరాలేదు కాబట్టి, ఈ దర్శకుడు అయినా తనకు హిట్ తెచ్చిపెడతారేమో అని ఎదురుచూస్తున్నాడు. సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎలాంటి మలుపులు ఉంటాయో ఎవరూ ఊహించలేం. భాస్కర్‌ని నమ్మి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించారంటే కథలో విషయం ఉండే ఉంటుంది. ఏ లెక్కన చూసినా నాలుగవ సినిమా ఈ ఏడాది రిలీజ్ అయ్యేలా లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments