Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజయ్ వేద్ నటించిన మట్టి కథకు 9 అంతర్జాతీయ అవార్డులు

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (17:50 IST)
Ajay Ved
అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో 9 అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది మట్టి కథ. ఈ సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు యంగ్ హీరో అజయ్ వేద్. అతని యాక్టింగ్ టాలెంట్, గుడ్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఒక కొత్త ప్రయత్నంగా  ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. మట్టి  కథ థియేటర్ లో చూసిన వారంతా అజయ్ వేద్ యాక్టింగ్ బాగుందని, అతనో ప్రామిసింగ్ టాలెంటెడ్ యాక్టర్ అవుతాడని అప్రిషియేట్ చేస్తున్నారు. మట్టి కథ ప్రచార కార్యక్రమాల్లో అజయ్ వేద్ మాట్లాడిన తీరు కూడా నటుడిగా అతనిలోని కాన్ఫిడెన్స్ చూపించింది.
 
మట్టి కథ రిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ అజయ్ వేద్ టాలెంట్, పంక్చువాలిటీ, కమిట్ మెంట్ తనను ఆకట్టుకుందని, అతనికి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పారు. థియేటర్ లో ఆడియెన్స్ ను తన యాక్టింగ్ తో ఇంప్రెస్ చేశారు అజయ్ వేద్. క్రియేటివ్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలనేది తన గోల్ గా చెబుతున్నారీ యంగ్ హీరో.
 
మట్టి కథ సినిమాలో అజయ్ వేద్ తో పాటు మాయ, కనకవ్వ, దయానంద్ రెడ్డి, బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పిరెడ్డి నిర్మించారు. సహనిర్మాత సతీశ్ మంజీర. పవన్ కడియాల దర్శకత్వం వహించారు. మట్టి కథ సినిమా ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మూడు కేటగిరీల్లో అవార్డులతో పాటు 9 అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అరిఘాత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments