Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామి స్క్వేర్‌లో ఐశ్వర్య రాజేష్.. త్రిష పాత్రలో కనిపిస్తుందా?

చియాన్ విక్రమ్ నటించిన చిత్రం సామి స్క్వేర్. ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ట్ర

Webdunia
బుధవారం, 4 జులై 2018 (12:40 IST)
చియాన్ విక్రమ్ నటించిన చిత్రం సామి స్క్వేర్. ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ట్రెండింగ్‌లో స్థానం సంపాదించుకుంది.

విక్రమ్ గెటప్, యాక్షన్ ఈ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయని సినీ యూనిట్ వెల్లడించింది. కాగా చిత్రాన్ని హరి తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తమీస్ ఫిలింస్ నిర్మిస్తోంది. 
 
ఈ సినిమాలో మరో కథానాయిక అవసరం కూడా ఉండటంతో కొంతమంది పేర్లను పరిశీలించారు. తాజాగా ఆ పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్‌ను తీసుకున్నట్లు సమాచారం. తమిళంలో ఐశ్వర్య రాజేశ్‌కి మంచి క్రేజ్ వుంది.

ఇప్పటికే విక్రమ్ జోడీగా ఆమె ''ధ్రువ నచ్చత్తిరమ్'' సినిమాలో నటించింది. దీంతో సామి స్క్వేర్‌లో రెండో హీరోయిన్‌గా ఆమెను తీసుకున్నారు. ఈ మేరకు విక్రమ్ ఐశ్వర్య కలిసి వున్న సామి స్క్వేర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
కాగా ఐశ్వర్యా రాజేష్ ''సామి-1''లో త్రిష రోల్‌లో కనిపిస్తుందని టాక్. ముందుగా త్రిషను ఈ సినిమా కోసం ఎంపిక చేశారు. కానీ ఆమె తన పాత్రకు అంత గుర్తింపు లేదని.. సినిమాలో కొద్దిసేపే తన పాత్ర కనిపిస్తుందని చెప్పింది. ఇంకా ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి.. అడ్వాన్స్‌ను కూడా తిరిగి ఇచ్చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో కోలీవుడ్‌లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో త్రిష వద్దన్న క్యారెక్టర్‌నే ఐశ్వర్య పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచార బాధితులకు ఎక్కడైనా వైద్యం చేయాలి : ఢిల్లీ హైకోర్టు

Pawan Kalyan: పవన్ 100 పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. శ్రీకృష్ణుడి స్థానంలో పుట్టాడు.. మహిళా ఫ్యాన్ (video)

వైకాపా విధ్వంసానికి పరిష్కారం లభించడం లేదు : సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఎలా సాగిందంటే? (video)

Shawls Turned Dresses: దుస్తులుగా మారిన శాలువాలు.. ఎమ్మెల్యే చింతమనేని అదుర్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments