Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజు విడుదల చేసిన ఐశ్వర్య రాజేష్ డ్రైవర్ జమున ఫస్ట్ లుక్

Webdunia
గురువారం, 5 మే 2022 (17:35 IST)
Driver Jamuna look
అద్భుతమైన నటనతో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఐశ్వర్య రాజేష్. విలక్షణమైన పాత్రలలో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్ తాజాగా 'డ్రైవర్ జమున' పేరుతో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతున్నారు.  ఔట్ అండ్ ఔట్ రోడ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పా. కిన్స్లిన్ దర్శకత్వం వహిస్తుండగా 18 రీల్స్‌ ఎస్.పి.చౌదరి నిర్మిస్తున్నారు.
 
తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు “డ్రైవర్ జమున” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ముఖం మీద చెమటలు, రక్తం మరకలతో ఫిరోషియస్ గా కనిపించారు ఐశ్వర్య రాజేష్.  
 
లేడీ క్యాబ్ డ్రైవర్ జీవితంలో చోటు చేసుకున్న నాటకీయ సంఘటనల నేపధ్యంలో 'డ్రైవర్ జమున' చిత్రాన్ని థ్రిల్లింగ్‌గా రూపొందిస్తున్నారు.  ఐశ్వర్య రాజేష్ ఈ పాత్ర కోసం చాలా మంది లేడీ క్యాబ్ డ్రైవర్లని కలసి వారి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు నేచురల్‌గా ఈ పాత్రకు సిద్ధమైయ్యారు.
 
సాధారణంగా రోడ్ మూవీస్ ని బ్లూ మ్యాట్ టెక్నాలజీని ఉపయోగించి చిత్రీకరిస్తారు. ఐతే ఐశ్వర్య రాజేష్ ప్రతి ఒక్క షాట్ను ఎటువంటి డూప్ ను లేకుండా నటించారు. ఈ చిత్రంలో తన పాత్ర వాస్తవానికి దగ్గరగా వుండే విధంగా స్వయంగా రోడ్లపై కారుని  నడిపారు.
 
జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కి గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రాఫర్ గా,  ఆర్ రామర్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
షూటింగ్ చివరిదశలో వున్న ఈ చిత్రాన్ని  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.
 
తారాగణం: ఐశ్వర్య రాజేష్, ఆడుకలం నరేన్, శ్రీ రంజని, ‘స్టాండ్ అప్ కమెడియన్’ అభిషేక్, పాండియన్, కవితా భారతి, పాండి, మణికందన్, రాజేష్ తదితరులు
 
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: పా. కిన్స్లిన్
నిర్మాత:  ఎస్.పి. చౌదరి
బ్యానర్: 18 రీల్స్
సంగీతం: జిబ్రాన్
డీవోపీ: గోకుల్ బెనోయ్
ఎడిటర్: ఆర్ రామర్
ఆర్ట్: డాన్ బాలా

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు (video)

రేణిగుంట: క్యాషియర్ మెడపై కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)

డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్

ప్రేమకు హద్దులు లేవు.. వరంగల్ అబ్బాయి.. టర్కీ అమ్మాయికి డుం.. డుం.. డుం..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాయలసీమ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments