Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధ‌ర్మంగా వుండ‌డ‌మే అస‌లైన‌ ప్ర‌జాస్వామ్యం అని చెప్పే రిప‌బ్లిక్ - ఫుల్ రివ్యూ

ధ‌ర్మంగా వుండ‌డ‌మే అస‌లైన‌ ప్ర‌జాస్వామ్యం అని చెప్పే రిప‌బ్లిక్ - ఫుల్ రివ్యూ
, శుక్రవారం, 1 అక్టోబరు 2021 (14:40 IST)
Repablic still
మ‌న‌ది ప్ర‌జాస్వామ్యం. ప్ర‌జ‌లే ఎన్నుకున్న పాల‌న‌. దీనిపై చాలా సినిమాలు వ‌చ్చాయి. కానీ ప్ర‌జాస్వామ్యామా! అదెక్క‌డుంది అని కొంద‌రు ప్ర‌శ్నిస్తారు. మ‌రికొంద‌రు మ‌న‌కెందుకులే మ‌న ప‌ని మ‌నం చేసుకుంటూ పోదామ‌నే ఆలోచ‌న‌లో జీవితాన్ని గ‌డిపేస్తుంటారు. ఇలా ప్ర‌జ‌లు వుండ‌బట్టే రాజ‌కీయ‌నాయ‌కుల నెత్తిమీద కూర్చుంటుఆరు. క‌నుక ప్ర‌భుత్వాధికారులలైన క‌లెక్ట‌ర్లు స‌మాజాన్ని మార్చాల‌నీ, పాల‌కుల అక్ర‌మాల‌ను అడ్డుక‌ట్ట‌వేయాల‌ని చూసే వారు కొంద‌రుంటారు. అలాంటివారిలో ఒక‌డైన పంజా అభిమార‌మ్ (సాయితేజ్‌) తో ద‌ర్శ‌కుడు దేవ్ క‌ట్టా చేసిన ప్ర‌య‌త్న‌మిది. శుక్ర‌వార‌మే విడుద‌లైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
క‌థః 
 
ప్ర‌భుత్వాధికారి జ‌గ‌ప‌తిబాబు కొడుకు అభిరామ్ (సాయితేజ్‌). స‌మాజంలో జ‌రిగే అన్యాయాల‌ను ప్ర‌శ్నించేవాడు. అందుకే వాటికి దూరంగా పెట్టాల‌ని అమెరికాకు పంపించాల‌నుకుంటాడు. కానీ దాన్ని బ్రేక్ చేసి ఇక్క‌డే సివిల్స్ చ‌దివి క‌లెక్ట‌ర్‌గా త‌న ఊరికే వ‌స్తాడు అభిరామ్‌. ఆ ఊరిలో తెల్లేరు స‌రస్సులో చేప‌ల వ్యాపారం చేస్తూ కార్మికుల‌ను బానిస‌లుగా చేస్తూ కోట్లు సంపాదిస్తుంది మ‌త్స‌శాఖా మంత్రి  విశాఖ వాణి (ర‌మ్య‌కృష్ణ). ఆ ప్రాంతంలో  ప్ర‌జ‌లు వింత‌రోగంతో చ‌నిపోతుంటారు. దానిగురించి ప‌రిశోధించ‌డానికి  వ‌చ్చిన వారు క‌నిపించ‌కుండాపోతారు. అలాంటివారిలో ఓ డాక్ట‌ర్ వుంటాడు. అత‌ను ఐశ్వ‌ర్య‌రాజేష్ కు సోదరుడు. త‌న అన్న‌కోసం వెతుక్కుంటూ ఇండియా వ‌స్తుంది ఆమె. ఇక్క‌డ పోలీసు వ్య‌వ‌స్థ‌, రాజ‌కీయ వ్య‌వ‌స్థ ఆయ‌న ఏమ‌య్యాడో ప‌ట్టించుకోరు. మ‌రోవైపు క‌లెక్ట‌ర్ అయిన అభిరామ్ దృష్టికి ఈ కేసు వ‌స్తుంది. ఆ త‌ర్వాత ఏమ‌యింది? ఎటువంటి ప‌రిణామాల‌తో క‌థ సాగింది అనేది మిగిలిన సినిమా. 
 
 విశ్వేష‌ణః
 
ఇందులో ద‌ర్శ‌కుడు చెప్ప‌ద‌ల‌చిన అంశం. ధ‌ర్మాన్ని మ‌నం న‌డిపిస్తే అదే మ‌న‌ల్ని న‌డిపిస్తుంది. వేదాల్లోనూ ఇదే చెప్పారు. అందుకే ప్ర‌జ‌లు ధ‌ర్మంగా వుంటేనే అదే ప్ర‌జాస్వామ్యం అనే నీతిని ఇందులో చెప్పాడు. ఆ ద‌శ‌లో వివిధ నేప‌థ్యాల‌లో క‌థ సాగుతూంటుంది. దేశం బాగుండాలంటే రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌, న్యాయ‌వ్య‌వ‌స్థ‌, ప్రభుత్వాధికార వ్య‌వ‌స్థ ఈ మూడు బాగుంటేనే అస‌లైన ప్ర‌జాస్వామ్యం వున్న‌ట్లు అని చెప్పారు. అమెరికాలో చ‌ట్ట‌విరుద్ధంగా గెలిచిన‌ట్లు చెప్పుకున్న ట్రంప్‌ను ఏవిధంగా అక్క‌డి న్యాయ వ్య‌వ‌స్థ త‌ప్పుప‌ట్టింది అనేది ప్ర‌ధాన అంశం. అలాంటి వ్య‌వ‌స్థ మ‌న ఇండియాలో ఎందుకు లేద‌నేది ద‌ర్శ‌కుడు, హీరో తాప‌త్ర‌యం. దీనిగురించి ప‌లు స‌న్నివేశాలు చొప్పించి చెప్ప‌ద‌ల‌చుకుంద‌ని చెప్పాడు.
 
ఆ క్ర‌మంలో వ‌ర్త‌మాన స‌మాజంలో జ‌రుగుతున్న రాజ‌కీయ దోపిడీలు, పాల‌కుల అవినీతి అక్ర‌మాల‌ను ఎండ‌గ‌ట్టారు. ప్ర‌జ‌ల‌కు మాయ‌చేయాలంటే స‌బ్సిడీలు రూపంలో సోమ‌రులుగా త‌యారు చేసి త‌మ‌కు అనుకూటంగా మార్చుకోవ‌డ‌మే అనే కొన్ని డైలాగ్‌లు బాగా ఆక‌ట్టుకున్నాయి. 
 
అన్నను వెత్తుకుంటూ విదేశాల నుండి వచ్చిన ఐశ్వర్యా రాజేశ్ పాత్రకూ తగిన ప్రాధాన్యమిచ్చాడు. ఈ వ్యవస్థను ప్రశ్నిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఆమె పాత్ర ద్వారా, ఆమె అన్న పాత్ర ద్వారా చూపించాడు. కరెప్టెడ్ బ్యూరోక్రాట్స్ పొలిటికల్ లీడర్స్ అడుగులకు మడుగులొత్తితే ఎలాంటి దారుణాలు జరుగుతాయో, పోలీస్ సిస్టమ్ అవినీతి మయమైతే ఎలాంటి దారుణాలు చోటు చేసుకుంటాయో చెప్పడానికి కలెక్టర్, ఎస్పీ పాత్రలను వాడుకున్నాడు. నిజాయితీ పరుడైనా కమ్యూనిస్టు పార్టీ నేత కూతురు తండ్రి సాధించలేనిది అడ్డదారులు తొక్కి ఎలా సాధించిందో, తన కొడుకును సీఎం పీఠంపై ఎలా కూర్చో పెట్టగలిగిందో విశాఖవాణి పాత్ర ద్వారా చూపించాడు. ఇలా ప్రతి పాత్రకూ ఓ మోటివ్ ను, వాటి ప్రవర్తన వెనుక ఓ లాజిక్ ను దేవ్ కట్టా స్క్రిప్ట్ దశలోనే పకడ్బందీగా రాసుకున్నాడు. దాంతో మూవీ మొత్తం స్ట్రయిట్ నేరేషన్ లో సాఫీగా సాగిపోయింది. ఒక్క హీరో తండ్రి గతాన్ని మాత్రమే ఫ్లాష్ బ్యాక్ లో చూపించారు. ఇటీవల సాయితేజ్ బైక్ మీద నుండి స్కిడ్ అయి పడిపోయి, హాస్పిటల్ పాలయ్యాడన్నది అందరికీ తెలిసిందే, సరిగ్గా అలాంటి సీన్ ముగింపులో పెట్ట‌డం యాదృశ్చిక‌మైనా చూసేవాడికి బాధాక‌రంగా అనిపిస్తుంది.
 
అయితే క‌లెక్ట‌ర్ అనేవారికి పూర్తి హ‌క్కులు ఇస్తేనే అత‌ను ఏదైనా చేయ‌గ‌డ‌ల‌నే కాన్సెప్ట్‌తో యు.జి.సి. వ్య‌వ‌స్థ పూర్తి అధికారులు అభిరామ్‌కు ఇస్తుంది. ఏ రాజ‌కీయ పార్టీకి అత‌న్ని ట్రాన్స్ ఫ‌ర్ చేసే హ‌క్కులేద‌ని చెబుతూ అది సాయితేజ్ పై చేసిన ప్ర‌యోగం బాగుంది. అస‌లు మ‌న రాజ్యాంగంలో ఏమి రాశారు? అనే అంశాలు కూడా చ‌ర్చిస్తే బాగుండేది. కానీ వాటి జోలికి వెళితే మ‌ళ్ళీ పాల‌కుల‌తో పోరాటంచేయాల‌నుకుని విర‌మించుకున్న‌ట్లున్నాడు ద‌ర్శ‌కుడు. 
 
 సినిమా మాధ్యమం ద్వారా కేవలం వినోదాన్ని మాత్రమే అందించడం కాకుండా, మన మధ్య జరుగుతున్న అవినీతి, అక్రమాలను వేలెత్తి చూపించే ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించాలి. ఇందులో పోలీస్ వ్యవస్థ కూడా చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో తమ చేతుల్లోకి తీసుకోకూడదు, అది రేపిస్టులను ఎన్ కౌంటర్ చేయడమైనా సరే అని హీరో పాత్ర ద్వారా చెప్పిండం బాగుంది.
 
న‌ట‌నాప‌రంగా అంద‌రూ బాగా చేశారు. ర‌మ్య‌కృష్ణ మ‌రోసారి హుందా అయిన పాత్ర‌ను పోషించింది. సాయితేజ్ నిజాయితీగ‌ల క‌లెక్ట‌ర్‌గా న‌టించాడు. శ్రీకాంత్ అయ్యంగార్ ఎస్పీగా, మనోజ్ నందన్ ఎస్.ఐ.గా ఆయా పాత్రలలో మెప్పించారు.
పాట‌ల‌కు పెద్ద‌గా అవ‌కాశం లేదుక‌నుక మణిశర్మ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఇందులో మూడే పాటలున్నాయి. వాటిని సుద్దాల అశోక్ తేజ్, రెహమాన్ రాశారు. అన్నీ సందర్భానుసారంగా వచ్చేవే. ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ, కె. రవికుమార్ యాక్షన్ సీన్స్ మూవీకి హైలైట్. నిర్మాణ విలువలూ బాగున్నాయి. 
 
ప్ర‌స్తానం త‌ర్వాత అంత సీరియ‌స్‌గా వ‌చ్చిన రిప‌బ్లిక్ స‌మాజాంలో జ‌రిగే చెడును ప్ర‌శ్నించ‌వారంద‌రికీ న‌చ్చుతుంది. సినిమా అంటే క‌మ‌ర్షియ‌ల్ అంశాలు వుండాలి. కానీ అవేవే లేకుండా సిస్సియ‌ర్ ప్ర‌య‌త్నంగా చేశాడు ద‌ర్శ‌ఖుడు. 
రేటింగ్ : 3/ 5 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంసారంలో సరిగమలుంటాయ్.. సమంత సర్దుకుపో.. శ్రీరెడ్డి