Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిరత్నం దర్శకత్వంలో విలన్‌గా ఐశ్వర్యారాయ్

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (08:39 IST)
అందాలభామ ఐశ్వర్యారాయ్ విలన్‌గా నటించనుంది. తనకు ఎంతో ఇష్టమైన మణిరత్నం దర్శకత్వంలో ఆమె నెగెటివ్ షేడ్ రోల్‌లో చేసేందుకు సమ్మతించినట్టు సమాచారం. అయితే, అది బాలీవుడ్ చిత్రం కాదు. తమిళ చిత్రం. 
 
సినీ ప్రేక్షకులను దాదాపు రెండు దశాబ్దాలకు అలరిస్తున్న అందాల తార ఐశ్వర్యా రాయ్ తల్లిగా మారిన తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇపుడు కూడా కుర్ర హీరోయిన్లతో పోటీపడుతూ దుమ్ము రేపుతోంది. బిడ్డ పుట్టడంతో సినిమాలకు లాంగ్ గ్యాప్ తీసుకున్న ఐష్ గతంతో పోల్చితే కాస్త తక్కువ సినిమాలు చేస్తోంది. 
 
మంచి కథ, మంచి పాత్ర అయితేనే నటించేందుకు ఆసక్తి చూపుతోంది. తాజాగా ఆమె మణిరత్నం దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. అది మాత్రమే కాకుండా కెరీర్‌లోనే మొదటి సారి ఐశ్వర్య రాయ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయనుంది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో ఐశ్వర్య నటించేందుకు ఓకే చెప్పిందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
మణిరత్నం దర్శకత్వం వహించిన అనేక చిత్రాలు ఐశ్వర్యారాయ్‌కి మంచి బ్రేక్ ఇచ్చింది. అందుకే ఎప్పుడు ఆయన కోరినా కూడా ఐష్ నటించేందుకు ఓకే చెబుతుంది. అలాగే ఇప్పుడు కూడా మణి చిత్రంలో విలన్‌గా నటించేందుకు ఆమె సమ్మతించినట్టు సమాచారం. అయితే ఐష్‌ను విలన్‌గా ఆమె అభిమానులు ఒప్పుకుంటారా అనేది చూడాలి. ఈ సినిమాను మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments