Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

ఠాగూర్
గురువారం, 3 ఏప్రియల్ 2025 (09:47 IST)
బాలీవుడ్ సినీ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌కు వ్యక్తిగత బాడీగార్డుగా శివరాజ్ పనిచేస్తున్నారు. ఈయన తీసుకునే వార్షిక వేతనంపై ఇపుడు చర్చ సాగుతోంది. ఒక ఎంఎన్‌సీ కంపెనీలో పని చేసే ఎగ్జిక్యూటివ్ తీసుకునే వేతనం కంటే ఎక్కువ మొత్తంలో నెల వేతనం తీసుకుంటున్నాడు. ఒక యేడాదికి మొత్తంగా రూ.84 లక్షలను బాడీగార్డ్ శివరాజ్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
శివరాజ్ అందుకుంటున్న వేతనం గురించి తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ముక్కున వేలేసుకుంటున్నారు. అతనికి ఇంత వేతనమా అంటూ నోరెళ్లబెడుతున్నారు. అతని వేతనం బహుళజాతి కంపెనీల ఈసీఓల కంటే అధికంగా ఉందనే చర్చసాగుతుంది. శివరాజ్ నెలకు రూ.7 లక్షలు తీసుకోగా, సంవత్సరానికి రూ.84 లక్షలు తీసుకుంటున్నారు. 
 
ఐశ్వర్యా రాయ్ బచ్చన్ దేశ విదేశాల్లో ఎక్కడకు వెళ్లినా ఆమె వెన్నంటే శివరాజ్ ఉంటారు. బాడీగార్డుగా విధులు నిర్వహిస్తున్న శివరాజ్.. బచ్చన్ కుటుంబానికి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. 2015లో శివరాజ్ వివాహానికి సైతం ఐశ్వర్య హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. దీనిని బట్టి బాడీగార్డు శివరాజ్‌కు బచ్చన్ ఫ్యామిలీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments