అందమైన రాణికి ఐశ్వర్యా రాయ్

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (07:19 IST)
దర్శక దిగ్గజం మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వం. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందుతోంది. ఇది రెండు భాగాలుగా రానుంది. అనేక స్టార్ నటీనటులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యా రాయ్ ఒకరు. ఈ చిత్రంలో ఈమె అందాల రాణిగా కనిపించనున్నారు. 
 
తాజాగా పీఎస్-1లో ఐష్‌ ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. 47 ఏళ్ల ఐష్‌.. అందమైన రాణి గెటప్‌లో పట్టు ఎర్రచీర, నగలతో మెరుస్తూ కనిపిస్తోంది. ఇటీవలే పుదుచ్చేరిలో జరిగిన షూటింగ్‌లో ఆమె పాల్గొంది. 
 
కాగా ఈ చిత్రం తొలిభాగం 2022లో విడుదలకానుంది. ప్రముఖ నటులు విక్రమ్‌, కార్తీ, త్రిష, ప్రకాశ్‌ రాజ్‌, జయం రవి తదితరులు ఇందులో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సుభాస్కరన్‌ సమర్పణలో మణిరత్నం నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం ఎ.ఆర్‌. రెహమాన్‌, కళ: తోట తరణి,కూర్పు: అక్కినేని శ్రీకర్‌ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: ఎస్‌. రవి వర్మన్‌.
 
ఇదిలావుంటే, మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యా రాయ్ నటిస్తున్న నాలుగో చిత్రం ఇది. గతంలో 1997లో విడుదలైన ‘ఇరువర్‌’ చిత్రంతో ఐష్‌ను తమిళ చిత్ర సీమకు దర్శకుడు మణిరత్నం పరిచయం చేశారు. ఆ తర్వాత వీరి కలయికలో.. 2007లో వచ్చిన ‘గురు’, 2010లో వచ్చిన ‘రావణ్‌’ వచ్చాయి. పదేళ్ల తర్వాత.. నాలుగోసారి వీరిద్దరూ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’తో మళ్లీ ప్రేక్షకులను పలకరించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP Cabinet: రూ.1లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం

పెళ్లి చేసుకుని పట్టుమని 10 నెలలైనా వుండలేకపోతున్న జంటలు, ఈ జంట కూడా...

రూ. 6 లక్షలు సుపారీ ఇచ్చి కన్నకొడుకునే హత్య చేయించిన తల్లి, కారణం ఏంటి?

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు : ఎన్.ఐ.ఏ దర్యాప్తు

టీవీకేకు ఉమ్మడి ఎన్నికల చిహ్నాన్ని పొందే ప్రక్రియ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

తర్వాతి కథనం
Show comments