RGV 'వ్యూహం' చూశాక YCP 'అరాచకం' సినిమా తీస్తా, ఆ పార్టీకి 29 సీట్లే: నట్టి కుమార్

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (18:20 IST)
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రంపై రచ్చ జరుగుతోంది. అటు జనసేన ఇటు తెదేపా కార్యకర్తలు ఈ చిత్రాన్ని విడుదల చేయరాదంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీవీ చర్చలో పాల్గొన్న ఉద్యమ నాయకుడు ఏకంగా వర్మపైన మరింత తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అది కేసు నమోదు వరకూ వెళ్లింది. కాగా ఈచిత్రం రేపు విడుదల కావాల్సి వుంది.
 
మరోవైపు ఈ చిత్రం గురించి సినీ నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. ఆర్జీవి తెరకెక్కించిన వ్యూహం సినిమా తాను చూస్తానని అన్నారు. ఐతే ఈ చిత్రం చూసిన వెంటనే తను కూడా వైసిపి అరాచకాలపై అరాచకం సినిమా తెరకెక్కిస్తానన్నారు. ఈ చిత్రంలో ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, వైసిపి ఎంపి రఘురామ కృష్ణంరాజుపై చిత్ర హింసలు ఇత్యాది వైసిపి అరాచకాలపై పూర్తి వివరాలతో సినిమా తీస్తానని చెప్పారు.
 
ఏపీ ప్రజలు వైసిపిపై తీవ్ర అసంతృప్తితో వున్నారనీ, ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 29 సీట్ల కంటే ఎక్కువ రావని జోస్యం చెప్పారు. తెదేపా-జనసేన కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని అన్నారు. త్వరలో తను చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతాననీ, ఆ తర్వాత తను రాజకీయ కార్యాచరణ గురించి చెబుతానన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు

Bengaluru Scam: రూ.32కోట్ల స్కామ్.. ఆమెకు అంత సంపాదన ఎలా వచ్చింది? నెటిజన్ల ప్రశ్న

తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న వర్షాలు.. తీవ్రమైన చలి

రూ.5వేలు ఇస్తామని చెప్పి.. జ్యూస్‌లో మద్యం కలిపారు.. ఆపై సామూహిక అత్యాచారం

అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments