Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. మేమిద్దరం విడిపోయాం.. ప్రకటించిన ధనుష్-ఐశ్వర్య

సెల్వి
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (23:32 IST)
నటుడు, నిర్మాత ధనుష్, దర్శకురాలు, రజనీకాంత్ తనయ ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ జంట ఇటీవల చెన్నై ఫ్యామిలీ కోర్టులో హిందూ వివాహ చట్టం, 1955 (పరస్పర అంగీకారంతో విడాకులు) సెక్షన్ 13B కింద విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 2022లో, ధనుష్, ఐశ్వర్య తాము విడిపోతున్నట్లు ప్రకటించారు.
 
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ధనుష్ ఇలా వ్రాశాడు: "పద్దెనిమిది సంవత్సరాల పాటు స్నేహితులుగా, జంటగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరికొకరు వత్తాసుగా వున్నాం. ప్రస్తుతం మన మార్గాలు వేరు చేసే ప్రదేశంలో నిలబడి ఉన్నాం. ఐశ్వర్య, నేను జంటగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము." అంటూ ప్రకటించారు. 
 
2004లో వివాహం చేసుకున్న ధనుష్- ఐశ్వర్యలకు ఇద్దరు కుమారులు. సినిమాల సంగతికి వస్తే.., ఐశ్వర్య 'లాల్ సలామ్'తో దర్శకురాలిగా తిరిగి వచ్చింది, ఇందులో ఆమె తండ్రి రజనీకాంత్ అతిధి పాత్రలో నటించారు. ధనుష్ తాజా విడుదల 'కెప్టెన్ మిల్లర్', అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన యాక్షన్-అడ్వెంచర్ చిత్రం సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా అమ్మకు కట్లపొడి, ఆకులు ఇష్టం.. ఉచిత బస్సులో వెళ్తున్నా.. వీడియో వైరల్

Lancet Study: భారత్‌ను వణికిస్తున్న మధుమేహం.. 10మందిలో నలుగురికి ఆ విషయమే తెలియదు!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబడదు.. పల్లా శ్రీనివాసరావు

అమరావతి గురించి ఏడవడం ఆపండి.. వైకాపా నేతలకు కౌంటరిచ్చిన నారాయణ

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో కుప్పకూలిపోయిన యువకుడు.. ఆ తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments