వకీల్ సాబ్, మల్లేశం సినిమాల్లో తన దైన శైలిలో ఆకట్టుకున్న అనన్య నాగళ్ళకు ఎక్కడికి వెళ్ళినా అందరూ గ్లామర్ రోల్స్ చేయమని అడుగుతున్నారట. ఈ విషయాన్ని ఆమె చెబుతూ.. గ్లామర్ రోల్స్ చేయాలి. సినిమా అంటే అదేకాదుకదా లేడీ ఓరియెంట్ పాత్రలు కూడా ముఖ్యమే. నాకు ఇలాంటివి వస్తున్నాయి. అందుకే తంత్ర సినిమా చేశాను అంటూ తెలియజేసింది. ఈ సినిమా ఫిబ్రవరి పదిహేనున విడుదలకాబోతుంది. ఇది తాంత్రిక విద్యలు నేపథ్యంలో సాగుతుంది.
ఇప్పటివరకు నన్ను వకీల్ సాబ్, మల్లేశం.. అనన్య నాగళ్ళ అంటున్నారు. కానీ తంత్ర సినిమా తర్వాత తంత్ర అనన్య అంటారనిపిస్తుంది. ఈ సినిమాలో కంటెంట్ అలాంటిది. నా పాత్రను డిజైన్ చేసిన తీరు బాగా నచ్చింది. ఇందుకు దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తలెియజేస్తున్నాను. ఇక నేను గ్లామర్ పాత్రలు వేస్తే చూడతగ్గది వుందంటే చేయడానికి సిద్ధం అని తెలిపింది.