Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోకు గోమూత్రంతో నిరసన .. ఎవరు?

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఓ చిన్నపాటి అలజడి నెలకొంది. ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే వారిని లక్ష్యంగా చేసుకుని వివిధ

Webdunia
గురువారం, 18 జనవరి 2018 (09:41 IST)
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఓ చిన్నపాటి అలజడి నెలకొంది. ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే వారిని లక్ష్యంగా చేసుకుని వివిధ రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. ఈ కోవలో అనేక మంది సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా ఆ కోవలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. 
 
ఈయనకు బీజేపీ అనుబంధ సంస్థ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. కర్ణాటకలోని సిర్సాలో జరిగిన ఓ కార్యక్రమంలో అతను పాల్గొన్న చోటును గోమూత్రంతో బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు శుద్ధి చేశారు. ఈ ఘటన సంక్రాంతి రోజున జరిగింది. 
 
"మన రాజ్యాంగం, మన గొప్పతనం" అనే కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా నిర్వాహకులు ప్రకాశ్ రాజ్‌ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్... కర్ణాటక ఎంపీ, కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డెపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన కొన్ని గంటల తర్వాత స్థానిక బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు అక్కడికి వచ్చి స్టేజ్ మొత్తాన్ని గోమూత్రంతో శుద్ధి చేయడం విశేషం. దీనిపై ప్రకాశ్ రాజ్ ట్విట్టర్‌లో స్పందించారు. మరి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఇలాగే గోమూత్రంతో శుద్ధి చేస్తారా అంటూ ప్రకాశ్‌రాజ్ సెటైర్ వేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments