Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ బిడ్డా ఇది నా అడ్డా. న‌న్ను కొట్టేవాడే పుట్ట‌లేదంటున్న - అల్లు అర్జున్‌

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (12:15 IST)
Allu Arjun- ae bidda song
న‌న్నైతే కొట్టెటోడు భూమి మీద పుట్ట‌లేదు. పుట్టాడా అది మ‌ళ్ళా నేనే- అంటూ చంద్ర‌బోస్ రాసిన సాహిత్యంతో కూడిన పుష్ప సినిమాలో పాట‌ను శుక్ర‌వారంనాడు విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. అల్లు అర్జున్ పై చిత్రించిన ఈ గీతం అత‌ని వ్య‌క్తిత్వానికి స‌రిప‌డేలా ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడు తీసుకున్న జాగ్ర‌త్త‌లా అనిపించింది. ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ సినిమా నుంచి ఏకాన్ స్టార్ అంటూ అల్లు అర్జున్‌ను బిరుదు ఇచ్చేశాడు. ఇక ఈ పాట‌కు `ఆర్‌.ఆఆర్‌.ఆర్‌.`కు కొరియోగ్ర‌ఫీ వ‌హించిన ప్రేమ్ ర‌క్షిత్ ప్ర‌త్యేకంగా చేయ‌గా, గ‌ణేస్ కొరియోగ్ర‌ఫీ స‌హ‌కారాన్ని అందించారు. 
 
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ముత్తంశెట్టి మీడియా తో కలిసి నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇందుకు సంబంధించిన మొదటి భాగం డిసెంబర్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పుష్ప ది రైజ్ పేరిట విడుదల కానుంది. హీరోయిన్ గా రష్మీక నటిస్తుండగా, ఫాహద్ ఫజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నటి సమంత సైతం ఈ చిత్రం లో ప్రత్యేక గీతం లో న‌ర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రంగారెడ్డి ఫామ్ హౌస్ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం.. 51మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్ట్

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments