Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున మేనకోడలు.. ''గూఢచారి''లో దుమ్ములేపింది.. ఇక ఛాన్సుల వెల్లువ?

''క్షణం'' తర్వాత అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం ''గూఢచారి''. సొంతంగా రాసుకున్న కథతో గూఢచారిని అడివి శేష్ తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ఓవర్సీస్‌ల్

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (18:31 IST)
''క్షణం'' తర్వాత అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం ''గూఢచారి''. సొంతంగా రాసుకున్న కథతో గూఢచారిని అడివి శేష్ తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ఓవర్సీస్‌ల్లోనే కాకుండా మనదేశంలో ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.


ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులు ''గూఢచారి'' ఓ స్పై థ్రిల్లర్ అంటూ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ నటించింది. ఆమె నటనపై కూడా ప్రస్తుతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 
 
గతంలో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా ద్వారా నాగార్జున మేనకోడలు సుప్రియ పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి వసూళ్లనే సాధించినా, ఆ తరువాత ఆమె మరో సినిమా చేయలేదు. మళ్లీ ఇంతకాలానికి సుప్రియ.. గూఢచారి సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించింది. రా ఆఫీసర్ నదియా ఖురేషి పాత్రలో సుప్రియ కనిపించింది. 
 
ఆమె పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకులను కట్టిపడేసింది. చాలా సహజంగా, అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకుంది. గూఢచారిలో దుమ్మురేపిన సుప్రియకు అవకాశాలు ఇక వెతుక్కుంటూ వస్తాయని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments