Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌ర్మ ఆవిష్క‌రించిన ఆదిత్య T 20 లవ్ స్టోరీ ఫ‌స్ట్ లుక్‌

Webdunia
శుక్రవారం, 22 జులై 2022 (16:40 IST)
శ్రీ ఆదిత్య, రమ్య, పవిత్ర, మాధురి హీరోయిన్లుగా ఎంజే క్రియేషన్స్ బ్యానర్ లో బేబీ మన్వితా చరణ్ అడపా సమర్పణలో చిన్నబాబు అడపా నిర్మిస్తున్న చిత్రం ‘ ఆదిత్య T 20 లవ్ స్టోరీ’. లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి చిన్ని చరణ్ అడపా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు.
 
 ఆదిత్య T 20 లవ్ స్టోరీ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా కొత్తగా ఉంది. హీరో శ్రీ ఆదిత్య స్టైలీష్‌‌గా కనిపిస్తున్నాడు. కళ్లజోడు లుక్ కూడా కొత్తగా అనిపిస్తుంది. మొత్తానికి ఈ పోస్టర్‌‌తో అందరిలోనూ చిత్రయూనిట్ అంచనాలు పెంచేసింది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్లు తెలిపారు.
 
ప్రభు తాళ్లూరి సహ నిర్మాతగా రాబోతోన్న ఈ చిత్రానికి కెమెరామెన్‌గా చిన్నబాబు అడపా, మ్యూజిక్ డైరెక్టర్‌గా చిన్ని చరణ్ అడపా, ఎడిటర్‌గా ఎంఆర్ వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి పాటలను వేల్పుల వెంకేటేష్ అందిస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అభిషేక్ రూఫస్ సమకూరుస్తున్నారు.వియఫ్ఎక్స్ మరియు గ్రాఫిక్స్ ను అఖిల్ (ASD) అందిస్తున్నారు. మిక్సింగ్ ఇంజనీర్‌గా వినయ్, ఫ్లై క్యామ్‌ను సుమన్ చక్రవర్తి అందిస్తున్నారు.ఇక ఆర్ట్ డైరెక్టర్‌గా శివ, స్టంట్స్‌ బాధ్యతలను దేవరాజ్ నూనె,అంజి చేస్తున్నారు. ఈ చిత్రానికి మేకప్‌మెన్‌గా చరణ్ నెండ్రు పని చేస్తున్నాడు.
 
ఈ చిత్రంలో శ్రీ ఆదిత్య, రమ్య, పవిత్ర, మాధురిలతో పాటు విజయ రంగరాజు, దత్తు, రాజనాల, అప్పారావు, మేరీ భావన వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments