Anasuya, Manchu Lakshmi, Varalakshmi
అనసూయగారిలో అందరూ రొమాంటిక్ యాంగిల్‌నే చూస్తుంటారు. కానీ ఆమె చేసిన రంగస్థలంలోని రంగమ్మత్త పాత్ర, పుష్ప సినిమాలోని దాక్షాయణి పాత్ర ఆమెలో ఉన్న గొప్ప నటిని అందరికీ పరిచయం చేశాయి. రమ్యకృష్ణగారి తర్వాత యాక్షన్ లుక్ విషయానికి వస్తే మాకు అనసూయగారే కనిపించారు. ఫస్ట్ సినిమాకి సంబంధించి వేసిన స్కెచ్‌లో సేమ్ టు సేమ్ పుష్ప లుక్కే వచ్చింది. ఈ స్టోరీ విన్నాక.. సుకుమార్‌గారిలాగే నా గురించి ఆలోచించారని అనసూయగారు మాకు థ్యాంక్స్ చెప్పారు. మొత్తం మూడు స్కెచ్‌లు రెడీ చేశాం. అందులో అనసూయగారు ప్రస్తుతం సినిమాలో కనిపించిన స్కెచ్‌ని ఓకే చేశారని దర్జా నిర్మాతలు తెలిపారు.
-ఈ స్టోరీ డిస్కషన్స్ జరిగినప్పుడు అనసూయగారు చేసిన పాత్ర కోసం ముందుగా మంచు లక్ష్మీ, వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియమణి ఇలా అనుకున్నాం. కానీ జర్నలిస్ట్ ప్రభుగారు అనసూయగారి పేరు సజెస్ట్ చేశారు. అందరూ ఓకే అనుకున్నాం. అలా అనసూయగారు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు.
- సెన్సార్ నుంచి కూడా చాలా ఫీడ్ బ్యాక్ విన్నాం. అనసూయగారిని పెట్టి ఇంత వయలెన్స్ సినిమా తీశారేంటి? అన్నారు. ఏది ఏమైనా మంచి సినిమా తీశామని చెప్పగలమని తెలిపారు. మరి కొత్తగా నిర్మాణరంగంలోకి వచ్చిన ఈ నిర్మాతలు ఏమేరకు అనుకున్నది సాధిస్తారో చూడాలి.