Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'పుష్ప'లో ఫ్యామిలీ మ్యాన్ హీరో.. హ్యాపీ సీన్ రిపీట్

Advertiesment
pushpa movie still
, మంగళవారం, 19 జులై 2022 (16:46 IST)
అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' సినిమా బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
 
పాన్‌ ఇండియా లెవల్‌లో ఈ సినిమా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. దీంతో పుష్ప-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. పుష్ప-2లో బాలీవుడ్‌ విలక్షణ నటుడు, ఫ్యామిలీ మ్యాన్‌ ఫేం మనోజ్‌ భాజ్‌పాయి నటించనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది.
 
ఇప్పటికే సుకుమార్‌ ఆయనకు స్క్రిప్ట్‌ వినిపించగా, వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్‌-మనోజ్‌ భాజ్‌పాయి కలిసి హ్యాపీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు ఒకే స్క్రీన్‌పై వీరు కనిపించనున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్తికేయ 2 యూనిట్‌కు బృందావన్ కు ప్రత్యేక ఆహ్వానం