Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుష్ప మ్యూజిక్ ఆల్బమ్ అదుర్స్.. 5 బిలియన్ వ్యూస్‌తో సరికొత్త రికార్డ్

Advertiesment
Pushpa poster
, గురువారం, 14 జులై 2022 (15:33 IST)
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో అలరించాయి. ఇప్పటికీ ఈ సినిమాలో మ్యూజిక్ ఆల్బమ్ కి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.
 
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ ఏకంగా 5 బిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కూడా ఈ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. 
 
ఈ క్రమంలోనే ఫైవ్ బిలియన్ వ్యూస్ అంటే ఏకంగా 500 కోట్ల వ్యూస్ రావడం అంటే సర్వసాధారణమైన విషయం కాదు. ఈ విధంగా పుష్ప సినిమా ఇలాంటి రికార్డులను సృష్టించడంతో బన్నీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప సినిమా ఈ స్థాయిలో రికార్డులను సృష్టించడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రంపై మరెన్నో అంచనాలు పెరిగాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉస్తాద్ రామ్ వారియ‌ర్ ఎలా వుందంటే- రివ్యూ రిపోర్ట్‌