Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'రాధేశ్యామ్' రివ్యూ రిపోర్ట్.. ఊహించని రీతిలో క్లైమాక్స్‌

Advertiesment
Radhe Shyam
, శుక్రవారం, 11 మార్చి 2022 (10:20 IST)
దర్శకత్వం : కె.రాధాకృష్ణ,
సంగీతం, నేపధ్య సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌,
నిర్మాతలు : భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్.
కథా రచయిత : కె.రాధాకృష్ణ కుమార్,
ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస
 
'రాధేశ్యామ్' పాన్ ఇండియా సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. కథలోకి వెళ్తే.. విక్రమాదిత్య (ప్రభాస్) ఒక ఫేమస్‌ పామిస్ట్‌. ఇండియాకి ఎమెర్జన్సీ వస్తోందని ఇందిరా గాంధీకి ముందే చెప్తాడు. దాంతో ఆమె ఆగ్రహానికి గురి అయిన అతను ఇండియా వదిలి లండన్ వెళ్ళిపోవాల్సి వస్తోంది. అయితే, ప్రేమను, పెళ్లిని పెద్దగా నమ్మని విక్రమాదిత్య కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ప్రేరణ (పూజా హెగ్డే) ను చూసి ప్రేమలో పడతాడు. 
 
కానీ, ప్రేరణ ఎక్కువ రోజులు బతకదు అని తెలుస్తోంది. ఇంతకీ ఆమెకు ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి ? చివరకు విక్రమాదిత్య - ప్రేరణ ఒక్కటయ్యారా ? లేదా ? అసలు విక్రమాదిత్య జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ? అతని గురువు పరమహంస (కృష్ణం రాజు) పాత్ర ఏమిటి ? మొత్తం ఈ కథకు విక్రమాదిత్య ఎలాంటి ముగింపు ఇచ్చాడు ? అనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ :
సింపుల్ గా చెప్పాలంటే.. సినిమాలో విజువల్స్ బాగున్నా.. సోల్ మిస్ అయ్యింది. ప్రభాస్ - పూజా పాత్రల మధ్య కెమిస్ట్రీ ఉన్నా ప్రేమ మిస్ అయ్యింది. భారీ బడ్జెట్ తో రూపొందింది అని పేరే గానీ, సినిమాలో ఒక్క క్లైమాక్స్ కి తప్ప ఇక దేనికి బడ్జెట్ పెట్టలేదు.
 
ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ప్రభాస్ -పూజల కెమిస్ట్రీ కొన్ని చోట్ల వర్కౌట్ అయ్యింది. ఎమోషనల్‌గా సాగే ఈ సినిమా క్లైమాక్స్‌లో విజువల్స్ సినిమా స్థాయికి తగ్గట్టు లేవు. కాకపోతే ఊహించని రీతిలో క్లైమాక్స్‌ను డిజైన్ చేయడం నిజంగా గొప్ప విషయమే. ప్రభాస్ డ్రెస్సింగ్.. యాక్టింగ్ ఆకట్టుకున్నాయి.
 
ప్లస్ పాయింట్స్ :
ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్సీ,
పూజా హెగ్డే గ్లామర్ అండ్ క్రేజ్,
భారీ విజువల్స్,
 
మైనస్ పాయింట్స్ :
లాజిక్ లెస్ లవ్ డ్రామా,
స్లో నేరేషన్,
స్లోగా సాగే స్క్రీన్ ప్లే, 
 
ప్యూర్ లవ్ డ్రామా వ్యవహారాలతో సాగిన ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ అండ్ సీన్స్ బాగున్నాయి. అలాగే సినిమా మెయిన్ పాయింట్‌లో కంటెంట్ ఉంది, కానీ, మిగిలిన బాగోతం అంతా రొటీన్ బోరింగ్ అండ్ సిల్లీ వ్యవహారాల తతంగమే. దాంతో అంచనాలను ఈ చిత్రం అందుకోలేకపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్.. రాధేశ్యామ్ ట్విట్టర్ రివ్యూ.. కెమిస్ట్రీ పేలిపోయింది..