Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిపురుష్ టీజ‌ర్‌కు మిలియ‌న్ల వ్యూస్, త్రీడీలో గొప్ప సినిమా కాబోతుంది

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (12:41 IST)
prabhas in sea
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ "ఆదిపురుష్". రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ నాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్ లపై భూషణ్ కుమార్,ఓం రౌత్  ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్ర నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ నుంచి వంశీ, ప్రమోద్ భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. ప్రెస్టీజియస్ మూవీగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య నగరంలో ఆదిపురుష్ టీజర్ విడుదల వేడుకను ఘనంగా నిర్వహించారు. 
 
Kriti Sanon
ఈ టీజర్‌కు రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది.24 గంటల్లో 101 మిలియన్ వ్యూస్ తో ఇండియాలోనే నెం 1 టీజర్ గా రికార్డు నెలకొలపడమే కాకుండా, యూట్యూబ్ లో నెంబర్ వన్ గా ట్రెండింగ్ లో నిలిచింది. త్రీడీ ఫార్మేట్ లో ఈ టీజర్ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తోంది. ఇదే అనుభూతి సినిమా రిలీజ్ అయ్యాక 3డిలో కలుగుతుందని నిర్మాతలు చెప్తున్నారు. అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల ప్రపంచస్థాయి సినిమాను మనం ఇప్పటివరకూ ఎంజాయ్ చేస్తున్నాం. "ఆదిపురుష్" కూడా అలాంటి వరల్డ్ క్లాస్ క్వాలిటీతో తెరకెక్కింది.
 
వచ్చే ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న "ఆదిపురుష్" సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఐమాక్స్ ఫార్మేట్ తో పాటు త్రీడీలో ఈ సినిమా తెరపైకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments