Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్-3 ఫేం దర్శన్ వాడుకుని వదిలేశాడంటున్న తమిళ సినీ నటి! (Video)

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (14:56 IST)
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ సినీ నటి చెన్నై పోలీసులను ఆశ్రయించింది. తనను బిగ్ బాస్-3 తమిళ ఫేం దర్శన్ త్యాగరాజన్ మోసం చేశాడని ఆరోపించింది. ఒక యేడాది రిలేషన్ పేరుతో తనను వాడుకుని ఇపుడు వదిలేశాడనీ ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... ఆ దర్శకుడి కోసం గాలిస్తున్నారు. 
 
ఇంతకీ పోలీసులకు ఫిర్యాదు చేసిన తమిళ నటి సనమ్ శెట్టి. ఈమె మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. 
 
కాలక్రమంలో ఆమెకు బిగ్ బాస్-3 ఫేం దర్శన్‌ త్యాగరాజన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ ఒక యేడాది పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత ఏమైందో కానీ సనమ్‌తో దర్శన్ బంధాలను తెంచుకున్నాడు. దీంతో సనమ్ పోలీసులను ఆశ్రయించింది.
 
మలేషియాలో ఉంటున్న దర్శన్ తనను ప్రేమిస్తున్నానని చెప్పి, మోసగించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చెన్నైలోని అడయార్ పోలీస్ స్టేషనులో ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్శన్ కోసం గాలిస్తున్నారు.
 
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, మోసం చేశాడని తన ఫిర్యాదులో సనమ్ పేర్కొంది. అతడిని కఠినంగా శిక్షించాలని కోరింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్శన్ కోసం గాలిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments