Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

ఠాగూర్
ఆదివారం, 23 ఫిబ్రవరి 2025 (13:22 IST)
తాను నటించే చిత్రాల్లో హీరోలతో ముద్దు పెట్టే సన్నివేశం వస్తే మాత్రం ఏమాత్రం వదులుకోనని హీరోయిన్ రీతూ వర్మ చెప్పారు. ఆమె తాజాగా "మజాకా" అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆమె స్పందిస్తూ, సినిమాల్లో ముద్దు సన్నివేశాలకు వ్యతిరేకం కాదన్నారు. తాను నటించే చిత్రాల్లో కిస్ సీన్లు వస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోనని చెప్పారు. ఛాన్స్ వస్తే మాత్రం కిస్, హగ్ సన్నివేశాల్లో జీవిస్తూ నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 
 
ముద్దు సన్నివేశాలకు సంబంధించిన చిత్రాల్లో నాకు అవకాశం రాలేదు. కథ డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లో యాక్ట్ చేయడానికి నేను ఏమాత్రం ఇబ్బందిపడను. ఈ అమ్మాయి ఇలాంటి పాత్రలు చేయదని కొంతమంది ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. ఆ కారణంతోనే నా వద్దకు అలాంటి కథలు రావడం లేదు అనుకుంటా అంటూ రీతూ వర్మ వ్యాఖ్యానించారు. 
 
తన గత చిత్రం "స్వాగ్‌" ఫెయిల్యూర్‌పై ఆమె స్పందిస్తూ, ఆ సినిమా అందరికీ సంబంధించినది కాదని, మేము మందు నుంచే అనుకున్నాం. ఆ కథలో ఉన్న తీవ్రత చాలా మందికి అర్థంకాలేదు. అయినా ఫర్లేదు. ఎందుకంటే మనం నటించే అన్ని సినిమాలు ప్రేక్షకులను ఆదరించాలని లేదు కదా. ఒక నటిగా ఆ సినిమా చేసినందుకు నేను మాత్రం సంతృప్తిగానే ఉన్నా అని చెప్పారు. 
 
తరుణ్ భాస్కర్ ప్రస్తుతం "ఈ నగరానికి ఏమైంది" చిత్రం రెండోభాగం రాస్తున్నారు. పెళ్ళిచూపులు-2 కూడా ఆయన తెరకెక్కిస్తే బాగుంటుందని నా భావన. అవకాశం వస్తే విజయ్ దేవరకొండ నేను కలిసి నటిస్తాం అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీలో నిద్రమాత్రలు కలిపి భార్యకు ఇచ్చి భర్త అత్యాచారం...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది టిబి రోగులకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సాయం

కల్నల్ సోఫియా ఖురేషిపై విజయ్ షా కామెంట్స్- ఫైర్ అయిన వైఎస్ షర్మిల

పహల్గామ్ ఉగ్రదాడి: పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం, జీవనోపాధి కోల్పోయిన వేలమంది

గాజాలో వైమానికదాడి.. 22 మంది చిన్నారులతో సహా 48 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments