Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాశి.. కొత్త లుక్.. స్లిమ్‌గా మారింది.. పోలీస్ ఆఫీసర్‌గా అదుర్స్

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (13:09 IST)
Rasi
ఐ యామ్ బ్యాక్ అంటూ కొత్త లుక్‌లో రాశి వచ్చేసింది. టాలీవుడ్‌లో ఒకప్పుడు తన నటన, అందంతో ప్రేక్షకులను మైమరిపించిన హీరోయిన్ రాశీ రీ ఎంట్రీ ఇస్తోంది. చాలా కాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఆమె ఇటీవలే ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించి అందులో వంట వీడియోలు పోస్టు చేస్తూ వచ్చింది.

ప్రస్తుతం సినిమాల్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగా మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. ప్రస్తుతం రాశికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
పోలీస్ అధికారిణి లుక్‌లో ఆమె కనిపించడంతో కొత్త సినిమా కోసమేననే ప్రచారం జరుగుతోంది. అప్పట్లో చాలా బొద్దుగా కనిపించిన రాశి ఇప్పుడు స్లిమ్‌గా మారిపోయి పోలీస్ గెటప్‌లో కనిపించింది. కాగా అంతకుముందు ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన ఆమె, నిజం సినిమాలో బోల్డ్ పాత్రతో పాటు, స్పెషల్ సాంగ్స్‌లోనూ నటించారు. 
 
చివరగా 2017లో లంక అనే ఓ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా రాశి క్యారెక్టర్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం పోలీస్ ఆఫీసర్ లుక్‌లో విడుదలైన ఫోటోలు ఏ సినిమాకు సంబంధించినవని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments