Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'పుష్ప' కోసం అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Advertiesment
'పుష్ప' కోసం అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
, మంగళవారం, 23 జూన్ 2020 (15:35 IST)
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల వైకుంఠపురములో చిత్రంతో ఆల్‌టైమ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం కోసం బన్నీ ఏకంగా రూ.25 కోట్ల మేరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. పైగా, ఈ చిత్రం లాభాల్లో 25 శాతం వాటాను పొందినట్టు టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ఇపుడు కె.సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రంలో అల్లు అర్జున్ నటించనున్నారు. ఈ చిత్రం కోసం బన్నీ ఏకంగా 35 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను అడిగినట్టు సమాచారం. అయితే, మ‌రి క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల బ‌డ్జెట్ విష‌యంలో నిర్మాత‌లు వెనుక ముందు ఆలోచిస్తున్నారు. ఈ త‌రుణంలో బ‌న్నీ రెమ్యున‌రేష‌న్‌లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకుంటాడేమో చూడాల‌ని గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సితారతో మహేష్ బాబు సూపర్ గేమ్.. వీడియో వైరల్ (video)