Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టు సూచనతో ఒక్కటై... శ్రీవారి సేవలో పాల్గొన్న రంభ దంపతులు...

సినీ నటి రంభ తన భర్త ఇంద్రన్ పద్మనాభన్‌తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం తన భర్త, పిల్లలతో కలిసి ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ అవకాశాలు తగ్గిన తర్వాత కెనడాకు చెందిన ఇంద్రన్ పద

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (14:46 IST)
సినీ నటి రంభ తన భర్త ఇంద్రన్ పద్మనాభన్‌తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం తన భర్త, పిల్లలతో కలిసి ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ అవకాశాలు తగ్గిన తర్వాత కెనడాకు చెందిన ఇంద్రన్ పద్మనాభన్ అనే పారిశ్రామికవేత్తతో రంభ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని చెన్నైకు వచ్చిన రంభ.. కోర్టు ద్వారా న్యాయపోరాటానికి దిగారు. తన భర్త నెలకు రూ.2.50 లక్షల భృతి చెల్లించాలని తొలుత కోర్టుకెక్కింది. ఆ తర్వాత తనతో కాపురం చేసేలా భర్తను ఆదేశించాలని మరో పిటీషన్‌ను కూడా దాఖలు చేసింది. 
 
వీటన్నింటిని పరిశీలించిన కోర్టు.. ఇద్దరూ కలిసి సామరస్య కేంద్రంలో ఓ నిర్ణయానికి రావాలంటూ సూచన చేసింది. దీంతో వారిద్దరు మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరు ఒక్కటై తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వారివెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments