Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తెలుగు సినీ ఫీల్డ్‌కి చిరు కింగ్... కింగ్‌ ఎప్పుడూ తన సామ్రాజ్యాన్ని వదిలివేయకూడదు' : రాధిక

తెలుగు చిత్ర సామ్రాజ్యానికి మెగాస్టార్ చిరంజీవి ఎపుడూ కింగ్ అని.. కింగ్ ఎపుడు కూడా తన సామ్రాజ్యాన్ని వదిలివేయకూడదని సీనియర్ నటి రాధిక అభిప్రాయపడింది. ఆమె ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (12:10 IST)
తెలుగు చిత్ర సామ్రాజ్యానికి మెగాస్టార్ చిరంజీవి ఎపుడూ కింగ్ అని.. కింగ్ ఎపుడు కూడా తన సామ్రాజ్యాన్ని వదిలివేయకూడదని సీనియర్ నటి రాధిక అభిప్రాయపడింది. ఆమె ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 
 
చాలా సంతోషకరమైన విషయం. సినిమాలు ఎందుకు వదిలేశారని నేను ఆది నుంచి పోరుపెడుతూనే వున్నాను. కనిపించినప్పుడల్లా నటించాలని చెబుతూనే వున్నాను. ‘తెలుగు సినీ ఫీల్డ్‌కి మీరు కింగ్‌. కింగ్‌ ఎప్పుడూ తన సామ్రాజ్యాన్ని వదిలెయ్యకూడదు’ అని చాలాసార్లు చెప్పాను. అలాంటిది ఇప్పుడాయన సినిమా చేశారంటే నాకెంతో సంతోషంగా వుంది. ఆయనకు అంతా మంచే జరగాలని శుభాకాంక్షలు చెబుతున్నాను.
 
తాను తెలుగులో చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేశాను. ఆయనతో ఏకంగా 28 సినిమాల్లో చేశానను. శోభనబాబుతోనూ ఎక్కువగానే చేశాను. తమిళంలో శివకుమార్‌, ప్రభు, మోహన్‌తో ఎక్కువగా నటించాను. సినిమాల కన్నా సీరియల్స్‌పైనే ఎక్కువగా కనిపిస్తున్నారు.. నా స్వంత సంస్థ నిర్మిస్తున్న సీరియల్స్‌ కదా. అందుకే అటువైపు దృష్టి సారించాను అని చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: మే 22 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు

ఏపీ లిక్కర్ స్కామ్ : నిందితులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

గూఢచర్యం కేసులో సమీర్ అరెస్టు.. ఇంతకీ ఎవరీ సమీర్!!

Couple fight: రోడ్డుపైనే దంపతుల కొట్లాట.. బిడ్డను నేలకేసి కొట్టిన తల్లి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments