Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుఎస్‌లో 'ఖైదీ నంబర్‌ 150' కలెక్షన్ల సునామీ.. "బాహుబలి - పీకే" చిత్రాలను బీట్ చేసిందా?

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్‌ 150' చిత్రం అమెరికాలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఫలితంగా రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతోంది. ఆయన నటించిన గత చిత్రాలకు భిన్నంగా 'ఖైదీ నంబర్ 150' కనకవర్షం

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (11:56 IST)
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్‌ 150' చిత్రం అమెరికాలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఫలితంగా రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతోంది. ఆయన నటించిన గత చిత్రాలకు భిన్నంగా 'ఖైదీ నంబర్ 150' కనకవర్షం కురిపిస్తోందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.
 
చాలా ఏళ్ల తర్వాత చిరు వెండితెరపై కనిపించిన ఈ చిత్రం అమెరికాలో తొలిరోజున 1,251,548 డాలర్లు (రూ.8.56 కోట్లు) రాబట్టిందని ట్వీట్‌ చేశారు. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించిన ఈ చిత్రంలో కాజల్‌ కథానాయికగా నటించారు. 
 
కాగా, ఖైదీ చిత్రం తొలి రోజున యుఎస్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఫలితంగా టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'బాహుబలి', అమీర్ ఖాన్ 'పీకే' చిత్రాలను బీట్ చేసి ఏకంగా దాదాపుగా 1.50 మిలియన్ డాలర్లను రాబట్టుకుంది. ఫలితంగా బాహుబలి, పీకే చిత్రాలు రికార్డులు గల్లంతయ్యాయి. ఈ రెండు చిత్రాలే కాకుండా ఏ ఒక్క భారతీయ మూవీ కూడా ప్రీమియర్ షోల ద్వారా 1.50 మిలియన్ డాలర్లను ఇప్పటివరకు రాబట్టలేదు 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments