Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌశల్ కాబట్టి ఓపిగ్గా అలా అన్నాడు.. నేనైతే కొట్టేదాన్ని.. మాధవీలత

బిగ్‌బాస్ షోలో కౌషల్ హౌస్ మేట్స్‌ను డాగ్స్ అన్నాడని పెద్ద రాద్దాంతం జరిగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోలో సోమవారం నుంచి గొడవులు జరుగుతూనే వున్న సంగతి తెలిసిందే. కౌశల్‌ని టార్గెట్ చేస్తూ హౌస్ మేట్స్ అ

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (16:08 IST)
బిగ్‌బాస్ షోలో కౌషల్ హౌస్ మేట్స్‌ను డాగ్స్ అన్నాడని పెద్ద రాద్దాంతం జరిగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోలో సోమవారం నుంచి గొడవులు జరుగుతూనే వున్న సంగతి తెలిసిందే. కౌశల్‌ని టార్గెట్ చేస్తూ హౌస్ మేట్స్ అందరూ దాడి చేస్తున్నారు. కావాలనే కౌశల్‌ని రెచ్చగొడుతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై నటి మాధవీలత స్పందించింది. 
 
మనిషిలో ఎనిమిది రకాల ఈవిల్స్ ఉంటాయి. గొడవ పడేప్పుడు ఒకరి తరువాత ఒకరుగా ప్రశ్నించాలి అలా కాకుండా ఒకేసారి దాడి చేస్తుంటే ఆ ఈవిల్స్‌లో ఏదోకటి ఆటోమేటిక్‌గా బయటకి వస్తుంటుందని మాధవీలత చెప్పింది. ఆ సమయంలో ఒకరు కాకుల్లా, రాబందుల్లా, కుక్కల్లా అనే పదాలు వాడుతుంటారు. దీన్ని తాను సమర్థిస్తున్నానని తెలిపింది.
 
కౌశల్ కాబట్టి అంత ఓపికగా సమాధానం చెబుతున్నాడు. తానైతే కొట్టేదాన్ని.. రోల్ ఏడవడం తనకు చాలా కామెడీగా అనిపించింది. కౌశల్ తన పిల్లలను చూసుకొని ఏడ్చాడు. ఆ సమయంలో ఎవరైనా ఓదారుస్తారు. కానీ రోల్ ఏడుస్తూ కౌశల్ నుండి ఓదార్పు ఆశించడమేంటి..? నలుగురు ఓదారుస్తున్నారు సరిపోలేదా..? తాను అతని ఎమోషన్‌ని తప్పుబట్టట్లేదు. 
 
సిట్యూయేషన్ కరెక్ట్ కాదని చెప్తున్నానని మాధవీ లత వెల్లడించింది. తాను ఏడుస్తున్నప్పుడు కౌశల్ పట్టించుకోవట్లేదని రోల్ అనడం ఏంటని మాధవీ లత వెల్లడించింది. ఒకేసారి మందొచ్చి మీదొచ్చి పడితే ఇలానే వుంటుందని మాధవీ లత తెలిపింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments