Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవున్రా బే నేను పొట్టిగనే ఉంటా... నీకెక్కడైనా నొప్పొచ్చిందా? మాధవీలత

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (09:52 IST)
తన ఎత్తుపై కామెంట్స్ చేసిన నెటిజన్లపై సినీ నటి మాధవీలత మండిపడింది. అవున్రా బే.. నేను పొట్టిగానే ఉంటా.. నీకెక్కడైనా నొప్పివచ్చిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతి ముఖ్యమైన పండగుల్లో ఒకటి బతుకమ్మ. ఇటీవల జరిగిన ఈ వేడుకల్లో మాధవీలత పాల్గొంది. దానికి సంబంధించిన వీడియోస్.. ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
 
ఈ వీటిని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేశారు. ముఖ్యంగా చాలా మంది నెటిజన్లు ఆమెను పొట్టిది అని కామెంట్స్ పెట్టారు. ఇది చూసిన మాధవీలత ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ఫైర్ అయింది.
 
"నేను శ్రీనగర్ కాలనీలోని బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నా. దానికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ పోస్ట్ చేశాను. అయితే చాలా మంది పొట్టిది.. పొట్టిది అంటూ కామెంట్స్ పెట్టారు. అవునురా బే.. నేను పొట్టిగనే ఉంటా. నీకేమైనా ఎక్కడన్న నొప్పొచ్చిందా.. నేను పొట్టిగ ఉంటే? నీకెక్కడైనా నొప్పొచ్చిందా? నీకేమైనా మాయరోగం వచ్చిందా? నీకేమైనా పొయ్యేకాలం వచ్చిందా? లేదు కదా?
 
మీ అమ్మ.. మీ అక్కా.. మీ చెల్లి అంతా పొడవుగా ఉన్నారు కదా. ఇంక హ్యాపీగా ఉండు. నాకు లేనిది.. మీకున్నందుకు సంతోషించండి. నామీద పడి ఎందుకు ఏడుస్తారు? నేను పొట్టిగా ఉండటం వల్ల ఎవ్వడికేమైనా నొప్పొస్తే చెప్పండి. ఆ నొప్పికి వెళ్లి హాస్పిటల్‌లో చూపించుకోండి. లేదంటే అది శాడిస్టిక్ డిసీజ్ అనుకుంటా. వెళ్లి ట్రీట్‌‌మెంట్ తీసుకో. ఫోటో పెడితే నచ్చింది.. లేదంటే నచ్చలేదు.. అనాలి. నేను పొట్టే.. నేను నల్లగా ఉంటా అయితే నీకేంటి? నీకు నచ్చకపోతే జస్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ మై పేజ్" అంటూ మండిపడుతూ రిప్లై ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments