Webdunia - Bharat's app for daily news and videos

Install App

దెయ్యాలతో తలపడనున్న కాజల్ అగర్వాల్!

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (10:16 IST)
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్. ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మాల్దీవుల్లోని సముద్ర భూగర్భ అందాల్లో తన హనీమూన్‌ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత తిరిగి తన సినీ కెరీర్‌పై దృష్టిసారించింది. ఇప్పటికే తాను కమిట్ అయిన మూవీల్లో నటించేందుకు షూటింగ్ స్పాట్‌లకు వెళుతోంది. 
 
ఈ క్రమంలో ఆమె తమిళంలో ఓ చిత్రంలో నటించేందుకు పచ్చజెండా ఊపింది. అదీ కూడా ఓ హారర్ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రానికి 'ఘోస్టీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. డీకే దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నలుగురు కథానాయికల్లో ఒకరిగా కాజల్‌ నటించనుంది. 
 
ఈ సినిమాలో హీరో ఎవరూ ఉండరని దర్శకుడు తెలిపారు. కాజల్‌ అగర్వాల్‌ పాత్రకు సంబంధించిన ఫొటోషూట్‌ను కూడా పూర్తిచేశామని ఆయన పేర్కొన్నారు. కెరీర్‌లో ఇప్పటివరకు హారర్‌ కథాంశంలో కాజల్‌ అగర్వాల్‌ నటించక పోవడం గమనార్హం. 
 
తొలిసారి ఈ జోనర్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉందని, తన పాత్ర చిత్రణలో వైవిధ్యం కనిపిస్తుందని కాజల్‌ అగర్వాల్‌ చెప్పింది. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ దెయ్యాల వల్ల ఇబ్బంది పడే పోలీస్‌ అధికారిణి పాత్రలో కనిపించనుందని సమాచారం. 
 
వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుందని తెలిసింది. ప్రస్తుతం కాజల్‌ అగర్వాల్‌ తెలుగులో 'ఆచార్య' 'మోసగాళ్లు' చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. త్వరలో 'ఆచార్య' షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments