బెంగుళూరు రేవ్ పార్టీ కేసు.. విచారణకు డుమ్మా కొట్టిన నటి హేమ!!

ఠాగూర్
సోమవారం, 27 మే 2024 (13:21 IST)
బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకు హాజరుకావాలంటూ బెంగుళూరు నగర పోలీసులు కోరగా టాలీవుడ్ నటి హేమ డుమ్మాకొట్టారు. ఈ విచారణకు హాజరయ్యేందుకు తనకు మరికొంత సమయం కావాలంటూ ఆమె కోరారు. బెంగుళూరు రేవ్ పార్టీలో దొరికన వారిలో డ్రగ్ తీసుకున్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ అయిన 86 మందికి బెంగుళూరు సీసీబీ పోలీసులు నోటీలు జారీచేసిన విషయం తెల్సిందే. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 27వ తేదీ సోమవారం బెంగుళూరులోని సీసీబీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులు అందుకున్న వారిలో నటి హేమ కూడా ఉన్నారు. అయితే, ఆమె విచారణకు డుమ్మా కొట్టారు. 
 
ఇదే అంశంపై ఆమె బెంగుళూరు సీసీబీ పోలీసులకు ఓ లేఖ రాశారు. తాను ప్రస్తుతం వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని, విచారణకు హాజరుకాలేనని అందులో పేర్కొన్నారు. విచారణకు హజరయ్యేందుకు తనకు కొంత సమయం కావాలని పోలీసులను అభ్యర్థించారు. అయితే, హేమ విజ్ఞప్తిని బెంగుళూరు పోలీసులు తిరస్కరించినట్టు సమాచారం. అదేసమయంలో ఆమెకు మరోమారు నోటీసులు పంపించాలని పోలీసులు భావిస్తున్నారు. 
 
కాగా, ఈ నెల 19వ తేదీన బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని జీఆర్ ఫాం‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెల్సిందే. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న మొత్తం 103 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిందరికీ రక్తపరీక్షలు చేయగా, నటి హేమతో పాటు మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. దీంతో వీరందరికీ నోటీసులు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments