Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలపాయ్ వ్యాఖ్యలను ఆరోజు ఒక్క మీడియా ప్రశ్నించలేదు ఎందుకని: నటి హేమ

సీనియర్ నటుడు చలపతిరావు బాబాయ్ చేసిన కామెంట్స్‌పై సినీ నటి హేమ మరోమారు స్పందించారు. చ‌ల‌ప‌తి రావు బాబాయి అలా మాట్లాడితే అక్కడే ఉన్న సినీన‌టులు, మ‌హిళలు ఎందుకు మాట్లాడ‌లేదంటూ, అప్పుడే తిట్టకూడదా? అంటూ

Webdunia
ఆదివారం, 28 మే 2017 (16:42 IST)
సీనియర్ నటుడు చలపతిరావు బాబాయ్ చేసిన కామెంట్స్‌పై సినీ నటి హేమ మరోమారు స్పందించారు. చ‌ల‌ప‌తి రావు బాబాయి అలా మాట్లాడితే అక్కడే ఉన్న సినీన‌టులు, మ‌హిళలు ఎందుకు మాట్లాడ‌లేదంటూ, అప్పుడే తిట్టకూడదా? అంటూ మీడియా ప్ర‌తిరోజూ ప‌దే ప‌దే ప్రశ్నిస్తోంద‌ని అన్నారు. అయితే, మ‌రి ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న మీడియా ఎందుకు అప్పుడు ఆయ‌న‌ను ప్ర‌శ్నించ‌లేద‌ని హేమ నిలదీశారు. మీడియాకు బాధ్యత లేదా? అలా మాట్లాడితే ఆడియో ఫంక్ష‌న్ల‌కు రాబోమ‌ని మీడియా ఎప్పుడైనా ప్ర‌క‌టించిందా? అని అడిగారు. 
 
ఎప్పుడైనా సినీ న‌టీమ‌ణుల వ‌ద్ద‌కు వ‌చ్చి వారి ఇబ్బందుల గురించి మీడియా అడిగిందా? అని హేమ ప్రశ్నించారు. సినీ న‌టీమ‌ణులు అంద‌రూ క‌లిసి ఓ అసోసియేష‌న్ పెట్టుకోండ‌ని స‌ల‌హాలు ఇచ్చారా? అని ప్ర‌శ్నించారు. న్యూస్ ఛానెళ్ల‌లో ఓ న‌టి వ్య‌భిచారం చేస్తోంద‌ని ఓ సారి ప‌దే ప‌దే వేశార‌ని, అలా ప్ర‌సారం చేయ‌డం కూడా త‌ప్పు క‌దా? అని ఆమె అడిగారు. జబర్దస్త్ వంటి ప్రోగ్రాంలపై ప్రోగ్రాంలు నిర్వహించి విమర్శించే మీడియా మరి తాము చేస్తోన్న తప్పుపై ఏం సమాధానం చెబుతుందని ఆమె అన్నారు. 
 
ఇటీవల జరిగిన ఓ సినీ కార్యక్రమంలో నటుడు చలపతిరావును మహిళా యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అమ్మాయిలు హానికరం కాదుగానీ, అమ్మాయిలు పక్కలోకి పనికివస్తారంటూ చేసిన వ్యాఖ్యలపు పెను వివాదం సృష్టించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వధువు స్థానంలో తల్లి.. బిత్తరపోయిన వరుడు...

ప్రాణాలను కాపాడే రక్తదాన కార్యక్రమంలో ముందున్న కెఎల్‌హెచ్‌ ఎన్ఎస్ఎస్

andhra pradesh weather report today ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Sri Reddy: పోలీసుల విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి.. క్షమించమని కోరినా వదల్లేదు

Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments