Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి కాబోతున్న హరితేజ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (19:50 IST)
Hariteja
యాంకర్, బిగ్ బాస్ ఫేమ్, నటి హరితేజ త్వరలోనే తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించారు. తాను త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నానని.. తనకు ఎంతో ఆనందంగా ఉందని ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెట్జన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇటీవల లాక్‌డౌన్‌లో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. 
 
బిగ్ బాస్ హౌస్ ద్వారా హరితేజ ఎంతో పాపులర్ అయ్యారు. అంతకుముందు కూడా ఆమె పలు సీరియళ్లు కార్యక్రమాలు చేసి తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత ఆమెకు సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. 'అఆ' సినిమాలోని పనిమనిషి పాత్ర ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. స్టార్ మా జెమినీ ఈటీవీ లాంటి చానల్స్‌లో ఆమె ఎన్నో విభిన్నమైన కార్యక్రమాలకు యాంకరింగ్ చేశారు. 
 
బిగ్ బాస్ సీజన్-1లో హరితేజ ఎంతో అలరించారు. ఆమె ఫైనల్ రౌండ్ దాకా హౌజ్‌లో కొనసాగారు. హరితేజ విజేతగా నిలుస్తారని అంతా భావించారు. కానీ చివర్లో ఓటింగ్ విషయంలో వెనక్కి వచ్చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో ఆమె చెప్పిన బుర్రకథ ప్రేక్షకులను ఎంతో అలరించింది. హరితేజ‌లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? అంటూ పలువురు ఆమెను మెచ్చుకున్నారు. ఇకపోతే.. తాజాగా హరితేజ తల్లి కాబోతుండటంతో పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 శాతం వేతనం డిమాండ్ చేస్తే 22.5 శాతం పెంచారు : కార్మిక శాఖ కమిషన్

5.5 కోట్ల మంది వీసాలను సమీక్షిస్తాం : అమెరికా ప్రకటన

అటెండెన్స్ మినహాయింపు.. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అందరికీ రెండు లడ్డూలు ఇచ్చారు.. నాకు ఒక్కటే ఇచ్చారు.. సీఎం హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు.. ఎక్కడ?

ప్రియురాలితో జరిగిన గొడవ: ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments