Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందం గురించి ఎవరైనా అడిగితే అప్పుడే వయసైపోతోందా అని భయం: హన్సిక

మనసుకు నచ్చేది పుల్లుగా లాగించేస్తా అదే నా గ్లామర్ సీక్రెట్ అంటున్న హన్సిక

Webdunia
ఆదివారం, 12 మార్చి 2017 (08:18 IST)
ఆహారపు నియమాలంటూ పెద్దగా ఏమీ పాటించను, నచ్చిన ఆహారం అయితే పుల్‌గా లాగించేస్తా. మనసును సంతోషంగా ఉంచుకుంటే అందం పెరుగుతూ పోతుంది. యోగా మనసును, శరీరాన్ని మెరుగు పరిస్తుంది.నేను నిత్యం యోగా క్రమం తప్పకుండా చేస్తాను అంటూ పదేళ్లుగా తాను మెయిన్‌టైన్ చే్స్తూ వస్తున్న ఆరోగ్య, సౌందర్య రహస్యాన్ని హన్సిక వెల్లడించారు. ఎవరైనా తన అందం గురించి మాట్లాడితే అప్పుడే వయసు అయిపోతోందా అనే భయం వెంటాడుతూ ఉంటుందని చెబుతున్న హన్సిక్ నటుడు జయం రవితో నటిస్తున్నప్పుడు చాలా కంపర్టబుల్గా ఉంటుందంటున్నారు. 
 
నటుడు జయంరవితో నటిస్తున్నప్పుడు నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందంటోంది నటి హన్సిక. దర్శకుల నటి, సక్సెస్‌ఫుల్‌ నటిలాంటి మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ నటించిన చిత్రాలు గత ఏడాది నాలుగు తెరపైకి వచ్చాయి. అలాంటిది తాజాగా కోలీవుడ్‌లో ఒక్క చిత్రం లేకపోవడం విశేషమే. ఇటీవల విడుదలైన బోగన్‌ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది అయినా అవకాశాలు లేవు. ఏంటీ హన్సిక పనైపోయిందాఇక దుకాణం బందేనా లాంటి చర్చ జరుగుతోంది. ఆమె అభిప్రాయాలను చూస్తే..
 
నేను 2007 నుంచి కథానాయకిగా నటిస్తున్నాను.ఏడాదికి నాలుగైదు చిత్రాలు నటిస్తూ వచ్చాను. నేను టాప్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నది 2012లోనే. నాకు క్వాంటిటీ ముఖ్యం కాదు.క్వాలిటీనే ప్రధా నం. ప్రస్తుతం చాలా కథలు వింటున్నాను.అందులో కొన్ని కథలను ఓకే చేశాను.సెలెక్టెడ్‌ చిత్రాలే చేస్తాను.
 
స్టార్‌ హీరోల సరసన మాత్రమే నటిస్తానని నేనేప్పుడూ చెప్పలేదే. మాన్‌కరాటే చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర హీరో శివకార్తీకేయన్‌ అప్పుడే ఎదుగుతున్న నటుడు. చిన్న నటుడు,పెద్ద నటుడు అన్న భేదాభిప్రాయాన్ని నేనెప్పుడూ వ్యక్తం చేయలేదు. 
 
జయంరవికి జంటగా నటిస్తున్నప్పుడు మాత్రమే చాలా సన్నిహితంగా నటిస్తారనే ప్రచారం నాపై ఉందా.. ఇలాంటి ప్రచారం ఎవరు చేస్తున్నారోగానీ, రవితో నేనిప్పటికి మూడు చిత్రాలు చేశాను. నేను జయంరవికి ఫ్యామిలీ ఫ్రెండ్‌ను.ఆయన భార్య ఆర్తి నాకు మంచి స్నేహితురాలు. వారిద్దరూ నా వెల్‌విషర్స్‌. జయంరవితో కలిసి నటిస్తున్నప్పుడు నేను చాలా కంఫర్టబుల్‌గా ఫీలవుతాను.ఆయన ఎప్పుడూ చిరునవ్వుతో పాజిటీవ్‌ ఎనర్జీతో ఉంటారు. సినిమాల్లో మేము కంఫర్టబుల్‌ జంటగా కనిపించడం వల్లే మీరు అన్నట్లు కొందరు భావిస్తున్నారేమో.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ విమాన ప్రమాదానికి పక్షుల గుంపు ఢీకొనడం కారణం కాదా?

దేశగతిని మార్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ బడ్జెట్!!

Annamalai : కొరడాతో ఆరు సార్లు కొట్టుకున్న అన్నామలై.. చెప్పులు వేసుకోను.. ఎందుకు? (video)

హిట్, ఫ్లాప్స్‌తో పాటు వివాదాలకు తెరలేపిన 2024 తెలుగు సినిమా రంగం

31 నుంచి పల్నాడులో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

తర్వాతి కథనం
Show comments