Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిదా అవుతున్న సాయిపల్లవి: అమెరికాలో షూటింగ్.. విరామంలో ఎంజాయ్

షూటింగ్‌ స్పాట్‌లో దర్శకుడు శేఖర్‌ కమ్ముల, హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్‌ సాయి పల్లవిల నవ్వులు చూస్తుంటే బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్టున్నారు.

Webdunia
ఆదివారం, 12 మార్చి 2017 (07:52 IST)
ఎన్నారైల కథలతో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. కానీ, అమెరికాలో ఉద్యోగం చేసి తిరిగొచ్చిన శేఖర్‌ కమ్ముల మాత్రం తెలుగు తెరపై తెలుగు సంప్రదాయాలను ఆవిష్కరించడానికి విలువిచ్చారు. ఇప్పుడు వరుణ్‌తేజ్‌ హీరోగా తీస్తున్న ‘ఫిదా’లోనూ ఆయన మార్క్‌ ప్రేమకథను చూపించబోతున్నారట! ‘ప్రేమ – ద్వేషం – ప్రేమకథ’ ఈ సిన్మాకు ఉపశీర్షిక. చిన్న ఛేంజ్‌ ఏంటంటే... కథకు ఎన్నారై టచ్‌ ఇచ్చారు. ‘ఫిదా’లో హీరో అమెరికన్‌ ఎన్నారై. తెలంగాణ అమ్మాయిను చూసి ఫిదా అవుతాడు. ప్రేమలో పడతాడు.
 
తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడాలి. ప్రస్తుతం అయితే అమెరికాలో షూటింగ్‌ చేస్తున్నారు. షూటింగ్‌ స్పాట్‌లో దర్శకుడు శేఖర్‌ కమ్ముల, హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్‌ సాయి పల్లవిల నవ్వులు చూస్తుంటే బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్టున్నారు. అప్పట్లో అమెరికాలో శేఖర్‌ కమ్ముల చేసిన చిలిపి పనులను వరుణ్‌తేజ్‌కి చెబుతున్నారో లేదా సినిమాలో ఆ సీన్లను రాశారో! ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్‌ సంగీత దర్శకుడు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

బ్లాక్ బ్యూటీ మిస్ వరల్డ్ శాన్ రేచల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments