Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి తర్వాత హ్యాపీ.. ఆయన దృష్టిలో నేనే సూపర్ స్టార్- అర్చన

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (18:03 IST)
Archana
``నాకిచ్చిన పాత్ర ఏదైనా సిన్సియర్‌గా చేస్తాను. ‘నేను’ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన నాకు చాలా మంచి పాత్రలు వచ్చాయి. శ్రీరామదాసులో సీత పాత్రతో మరింత పేరు వచ్చింది. నా వర్కింగ్ స్టైల్ అంటూ నాకుంటుంది. ఒక పాత్రకే పరిమితమయ్యేలా చూసుకోను. నాకు డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం. స్పెషల్ సాంగ్స్ చేయడం,  గ్లామర్ రోల్స్ చేయడం వల్ల ఆఫర్స్ తగ్గుతాయని నేను అనుకోను. పెళ్లి తర్వాత హ్యాపీగా ఉన్నాం. నా భర్త దృష్టిలో నేనే సూపర్ స్టార్.  ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నాను.  కెమెరామెన్  అంజి డైరెక్షన్ లో ఈరోజే  ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేశాను. చాలా ఇంటరెస్టింగ్ రోల్ లో  నటిస్తున్నాను’.. అంటున్నారు న‌టి అర్చ‌న‌.
 
తాజాగా అర్చన న‌టించిన సినిమా ''అన్నపూర్ణమ్మ గారి మనవడు''. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
స్వచ్ఛమైన పల్లెటూరి కథతో ఉమ్మడి కుటుంబాలలో వున్న అనుబంధాలను, మానవ సంబంధాలను  సమ్మిళతం చేసి తెరకెక్కించిన చిత్రమే ఇది. ఈ నేపథ్యంలో హీరోయిన్ అర్చన మాట్లాడుతూ, ‘2020 ప్రభావం మనపై బాగా చూపించింది.  ఈ ఏడాది అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నా. అన్నపూర్ణమ్మ, జమున గారి సినిమాలను చిన్నప్పట్నుంచీ చూస్తూ పెరిగాను. వాళ్ల మూవీలో నటించే చాన్స్ రావడం సంతోషంగా ఉంది. 
 
కొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న  చిత్రాలను ఆడియెన్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. కళాతపస్వి కె.విశ్వనాధ్ గారు ఈ చిత్రం చాలా బావుందని ప్రశంసించడం ఆనందంగా ఉంది. ఇందులో మెడికల్ స్టూడెంట్‌గా మొదలయ్యే నా పాత్ర ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకోవడం, ప్రేమించినవాడి కోసం ఎంత దూరమైనా వెళ్లే పాత్ర చేశాను.
 
సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరువు హత్యలను కూడా ఈ చిత్రంలో చూపించారు. నటనకు ఎంతో అవకాశం ఉన్న పాత్రను ఇందులో పోషించాను. దర్శకుడు నర్రా శివానాగేశ్వరరావు చిత్రంతో పాటు నా పాత్రను అద్భుతంగా మలిచారు. నేను నటించిన అన్ని సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ మూవీతో మరిన్ని అవకాశాలు వస్తాయని అనుకుంటున్నా.. అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments