Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ జాతకాలన్నీ ఉన్నాయ్.. లీక్ చేస్తే మీ పిల్లల పిల్లలకు పెళ్లిళ్లు కాకుండా పోతాయ్...

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (18:20 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలపై సినీ నటి అపూర్వ మండిపడింది. మీ జాతకాలు నా వద్ద ఉన్నాయ్.. వాటిని బయటపెట్టానంటే మీ పిల్లలల పిల్లలకు పెళ్లిళ్లుకాకుండా పోతాయ్ అంటూ హెచ్చరించింది. అంతేనా, ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కూడా నిలదీసింది. ప్రజాస్వామ్యమంటే ఇదేనా ప్రశ్నించింది.
 
నటి అపూర్వను లక్ష్యంగా చేసుకుని టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు యూట్యూబ్ చానెళ్ళలో నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై నటి అపూర్వ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న అరాచకాలపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలంటూ విజ్ఞప్తి చేశారు. వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
 
ఆమె ఇంకా ఏమన్నారంటే 'తొలి నుంచి మేం తెలుగుదేశం పార్టీకి అభిమానులం. కానీ ఇప్పటి అన్యాయాలను చూసి తట్టుకోలేక బయటకు వచ్చేశాం. సీఎం సార్.. ఏం రాజకీయాలు సార్ ఇవి? ఇదేం ప్రజాస్వామ్యం? మీ నాయకులు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఇది ఇప్పటికైనా సీఎం చంద్రబాబు దృష్టికెళ్లాలి. నాలా ఇంకో ఆడపిల్ల బాధపడకూడదు. నా వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. నన్ను సీత అన్నా ఫర్వాలేదు.. సిల్క్ స్మిత అన్నా ఫర్వాలేదు. మీ జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయి. అవి బయటపెడితే.. మీ పిల్లల్ల పిల్లలకు పెళ్లి కాకుండా పోతాయి' అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments