Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏంటి మెహ్రీన్...? అదేదో ఇచ్చేయరాదూ... ఎవరు? ఏంటది?

Advertiesment
Producer
, శనివారం, 15 డిశెంబరు 2018 (18:34 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మంచి ఊపు మీదున్న నటి మెహ్రీన్ ఈమధ్య ఇండస్ట్రీలో వార్తల్లో నిలుస్తోంది. ఈమె పులి వాసు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తోంది. ఐతే ఉన్నట్లుండి నిర్మాతకు షాకిచ్చిందట. హీరోను మార్చేసి మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే నటించడానికి నేను తేరగా వున్నానా అంటూ మండిపడుతోందట. అసలు విషయం ఏంటయా అంటే.. మెగాస్టార్ చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఇటీవలే ఓ సినిమా స్టార్ట్ అయింది కదా. ఈ చిత్రాన్ని తొలుత సుధీర్ బాబు హీరోగా ప్రియా వారియర్ హీరోయిన్‌గా చేయాలని అనుకున్నారట.
 
ఏమైందో తెలియదు కానీ... ప్రియా వారియర్ ఈ చిత్రాన్ని తను చేయడం లేదని అడ్డం తిరిగిందట. దానితో ఆ పాత్రలో మెహరీన్‌ను తీసుకున్నారట. ఇందుకు గాను ఆమెకు 30 లక్షల పారితోషికం ఇస్తామని ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. అడ్వాన్సుగా రూ. 10 లక్షలు ఇచ్చారట. ఐతే ఎందుకో తెలియదు కానీ సుధీర్ బాబు కూడా తను ఈ చిత్రంలో హీరోగా చేయనని హ్యాండిచ్చాడట. దానితో మెగాస్టార్ అల్లుడు కల్యాణ్ దేవ్‌ను సంప్రదించి ఆయన్ని ఓకే చేశారట. 
 
ఈ విషయం తెలిసిన మెహ్రీన్... మీ ఇష్టం వచ్చినట్లు హీరోను మార్చేసి నటించమంటే నటించడానికి నేనేమి తేరగా లేనంటూ మండిపడుతోందట. ముందుగా చెప్పినట్లు కాకుండా ఇలా మార్పులు చేసినందుకు తను నటించననీ, అలాగే తనకు ఇచ్చిన అడ్వాన్సు కూడా తిరిగి ఇవ్వనని అంటున్నట్లు టాలీవుడ్ సినీ జనం చెప్పుకుంటున్నారు. 
webdunia
 
ఐతే నిర్మాత మాత్రం... మెహ్రీన్ నటించి తీరాల్సిందేనంటూ పట్టుబడుతున్నాడట. దీనికి మెహ్రీన్ ససేమిరా అనడంతో తన అడ్వాన్సు ఇప్పించాలని నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశాడట సదరు నిర్మాత. మరోవైపు మెహ్రీన్ కు మద్దతుగా కొందరు హీరోలు, మేనేజర్ తప్ప ఎవ్వరూ లేరట. దీనితో కొందరు పేరుమోసిన నిర్మాతలు... ఎందుకు మెహ్రీన్... ఆ అడ్వాన్స్ ఏదో తిరిగి ఇచ్చేయరాదూ అని సలహాలు ఇస్తున్నారట. అలా ఇచ్చేయమనేవారు ఆమెకేమైనా ఆఫర్లు ఇస్తే బాగుంటుందిగా అని ఆమెకు మద్దతుగా వుండేవారు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎబిసిడి చిత్రంలో అల్లు శిరీష్ తండ్రి పాత్ర‌లో నాగబాబు..