Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకుడి మూతి పచ్చడి చేసిన నటి అంజలి.. ఎందుకంటే?

అచ్చ తెలుగు అమ్మాయి అంజలి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో మంచి పేరు, గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో నటించింది. గతకొంతకాలంగా అవకాశాలు లేకపోవడంతో

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (16:46 IST)
అచ్చ తెలుగు అమ్మాయి అంజలి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో మంచి పేరు, గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో నటించింది. గతకొంతకాలంగా అవకాశాలు లేకపోవడంతో ఆమె వెండితెరపై కనిపించడం లేదు.
 
ఈ నేపథ్యంలో అంజలి "లీసా" అనే తమిళ మూవీలో చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఓ యాక్షన్ సన్నివేశంలో భాగంగా తన చేతిలో ఉన్న దోసె పెనంను కెమెరా ముందుకు ఆమె విసిరేయాలి. దీంతో ఆమె దర్శకుడు చెప్పినట్టుగానే అంజలి చేసింది. 
 
అయితే, పొరపాటున ఆ పెనం నేరుగా వెళ్లి దర్శకుడి ముఖానికి తాకింది. దీంతో, ఆయనకు కనుబొమల మధ్య చిట్లి, తీవ్రగాయమైంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లి, కుట్లు వేయించారట. ఈ ఘటన పట్ల అంజలి చాలా బాధ పడిందట. షూటింగ్ సమయంలో ఇలాంటివన్నీ సహజమేనని యూనిట్ సభ్యులు సర్దిచెప్పినప్పటికీ ఆమె మాత్రం బాధపడుతూనే ఉందట. 
 
కాగా, చిత్రం 3డీ హారర్ ఫిల్మ్‌గా తెరకెక్కుతుండగా, ఈ చిత్రానికి రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అంజలితో పాటు ప్రేమ్ నజీర్, భావని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments