Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బుల కోసం ఏమైనా రాస్తారా? దేశంలో ఒంటరిగా జీవిస్తున్న మహిళలు లేరా? నటి మీనా ప్రశ్న

వరుణ్
ఆదివారం, 24 మార్చి 2024 (09:52 IST)
సీనియర్ నటి మీనా తన రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లపై మండిపడ్డారు. డబ్బు కోసం ఏమైనా, ఎలాంటి వార్తలనైనా రాస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వార్త రాసేముందు నిజా నిజాలు తెలుసుకోరా అని ఆమె ప్రశ్నించారు. తాను ఒంటరిగానే ఉంటానని, దేశంలో ఒంటరిగా నివశిస్తున్న మహిళలు లేరా అని ఆమె సూటిగా అడిగారు. తన తల్లిదండ్రులు, కుమార్తె భవిష్యత్ కోసమే తన ఆలోచనలన్నీ ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. 
 
గత 1990లో చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన మీనా... వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే, ఆ మధ్య తన భర్త సాగర్‌ను కోల్పోయింది. ఆ బాధ నుంచి బయటపడేందుకు మళ్లీ సినిమాల్లో నటిస్తుంది. వరుస షూటింగులతో బిజీగా గడుపుతుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు రాస్తున్నారు. ఈ విషయం వారికి ఎవరు చెప్పారో తనకు తెలియదు. డబ్బు కోసం ఎలాంటి వార్తలైనా రాస్తారా అని ప్రశ్నించారు. మీడియా నానాటికీ దిగజారిపోతుందన్నారు. ఒక వార్త రాసే ముందు వాస్తవాలు తెలుసుకుని రాయాలని ఆమె హితవు పలికారు. తాను ఒంటరిగానే ఉంటానని, దేశంలో ఒంటరిగా జీవిస్తున్న మహళలు ఎంతో మంది ఉన్నారని చెప్పుకొచ్చింది. తన తల్లిదండ్రులు, తన కుమార్తె భవిష్యత్ కోసం ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నట్టు చెప్పారు. తాను భవిష్యత్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో ఇపుడే ఎలా చెబుతానని ప్రశ్నించింది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. ప్రస్తుతానికి రెండో పెళ్ళి గురించి ఆలోచన లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వయంగా కారు నడుపుతూ కనిపించిన కేసీఆర్.. బీఆర్ఎస్ వర్గాల్లో ఖుషీ (video)

తెలంగాణలో చలి: కొమరం భీమ్ జిల్లాలో వణికిపోతున్న జనం

భువనేశ్వర్‌: నాలుగేళ్ల బాలికను.. రూ.40వేలకు అమ్మేశారు.. ఎందుకంటే?

రఘురామకృష్ణంరాజు కేసు.. రిటైర్డ్ సీఐడీ ఏఎస్పీ అరెస్ట్.. ఇవన్నీ జరిగాయా?

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments