Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీడీపీ చీఫ్‌ చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు.. 24 గంటల డెడ్‌‍లైన్...

chandrababu

ఠాగూర్

, మంగళవారం, 19 మార్చి 2024 (10:03 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. ఏపీ సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియా విభాగం అసభ్యకర పోస్టులు పెడుతోందంటూ అందిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీచేస్తూ, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను 24 గంటల్లో తొలగించాలని ఆదేశించింది. వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసిన ఫిర్యాదుపై ఏపీ ఎన్నికల కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా ఈ నోటీసులు జారీ చేశారు. 
 
సోషల్ మీడియా వేదికలైన ఎక్స్, ఫేస్‍బుక్, యూట్యూబ్‌లలో సీఎం జగ్ వ్యక్తిత్వంపై దాడి చేసేలా ప్రచారం చేస్తున్నారని, అసభ్యకర ప్రచారం చేస్తున్నారని వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పందిస్తూ, చంద్రబాబుకు నోటీసులు పంపించారు. టీడీపీ సోషల్ మీడియాలో విభాగం పోస్టులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, 24 గంటల్లోగా సీఎం జగన్‌పై పెట్టిన అభ్యంతరకర పోస్టులు తొలగించాలని ఆదేశించారు. 
 
ఇదిలావుంచితే ఆదివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట బొప్పూడిలో జరిగిన ఎన్డీయే కూటమి సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు భారత వాయుసేన హెలికాఫ్టర్‌ను ఉపయోగించారంటూ టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ఈ ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళేందుకు టెయిల్ నంబర్ 5236 గల ఐఏఎఫ్ హెలికాఫ్టర్‌ను ఉపయోగించారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై మొబైల్ నంబర్ పోర్టబులిటికీ సరికొత్త నిబంధన!!