Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పెటా'కు లీగల్ నోటీస్ పంపిన తమిళ నటుడు సూర్య

సూర్య నటించిన 'ఎస్‌3' చిత్రం తమిళనాడు తుఫాను వల్ల ఒకసారి పెద్ద నోట్ల రద్దుతో మరోసారి, జయలలిత మరణంతో ఇంకోసారి విడుదల వాయిదా పడుతూవచ్చింది. ఎట్టకేలకు రిపబ్లిక్‌డే రోజైన ఈనెల 26న విడుదలకావాల్సిన ఈ చిత్రం

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (16:16 IST)
సూర్య నటించిన 'ఎస్‌3' చిత్రం తమిళనాడు తుఫాను వల్ల ఒకసారి పెద్ద నోట్ల రద్దుతో మరోసారి, జయలలిత మరణంతో ఇంకోసారి విడుదల వాయిదా పడుతూవచ్చింది. ఎట్టకేలకు రిపబ్లిక్‌డే రోజైన ఈనెల 26న విడుదలకావాల్సిన ఈ చిత్రం మరో వివాదంలోకి వెళ్ళింది. తమిళనాడులో జరుగుతున్న 'జల్లికట్టు' సమస్యను తన చిత్రం 'ఎస్‌3' ప్రమోషన్‌లో భాగంగా వాడుకుంటున్నాడని... అందుకు అమెరికాకు చెందిన జంతు పరిరక్షణ సంస్థ "పెటా" (పీపుల్‌ ఫర్‌ ది ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ అనిమల్స్‌) నటుడు సూర్యను నిందితుడిగా పేర్కొంది. 
 
దీనిపై టైమ్స్ ఆఫ్‌ ఇండియా మొబైల్‌ యాప్‌లో 18వ తేదీన వార్త ప్రచురితమైంది. ఇది తనతోపాటు తన కుటుంబాన్ని, తన అభిమానుల్ని బాధించిందని పేర్కొంటూ పెటాకు చెందిన పలువురు సభ్యులకు సూర్య తరపు లాయర్‌ విజ్ఞప్తి చేశారు. అందులో చెప్పిదాన్నిబట్టి.. వివిధ సందర్భాల్లో జల్లికట్టుకు మద్దతుగా మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించారు. 
 
అటువంటి వ్యక్తి తన సినిమా కోసం ఇలాంటి ట్రిక్‌ ప్లే చేయనవసరంలేదని పేర్కొన్నారు. సమాజంలోని పౌరుడుగా పలు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్న సూర్యపై ఇటువంటి నిందమోపడం సముచితం కాదనీ.. పెటా వెంటనే క్షమాపణ చెప్పాలనీ.. లేదంటే న్యాయపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments