Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెన్సార్ పూర్తి చేసుకొన్న మంచు విష్ణు "లక్కున్నోడు"

మంచు విష్ణు-హన్సిక జంటగా తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ "లక్కున్నోడు". "గీతాంజలి" ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని "యు/ఏ" సర్టిఫికెట్ అందుకొంది.

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (16:12 IST)
మంచు విష్ణు-హన్సిక జంటగా తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ "లక్కున్నోడు". "గీతాంజలి" ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని "యు/ఏ" సర్టిఫికెట్ అందుకొంది. ఎం.వి.వి సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. "రోమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు రాజ్ కిరణ్ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. డైమండ్ రత్నబాబు స్క్రీన్ ప్లే-మాటలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తాయి. 
 
"దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద" లాంటి సక్సెస్ ఫుల్ ఫిలిమ్స్ తర్వాత విష్ణు-హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం కావడంతోపాటు, "ఈడోరకం ఆడోరకం" వంటి సూపర్ హిట్ అనంతరం మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం అవ్వడంతో "లక్కున్నోడు"పై మంచి అంచనాలు నెలకొన్నాయి. 
 
విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి. సినిమా కూడా అదే స్థాయిలో వారిని అలరిస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా "లకున్నోడు" చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మా బ్యానర్‌లో మరో సూపర్ హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకం ఉంది" అన్నారు. 

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments